ఎన్నికల్లో విజయం సాధించిన.. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్?

praveen
సాదరణంగా అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగిన వారు ఇక ఏదో ఒక సమయంలో తమకు ఇష్టమైన క్రికెట్ ఆటకు వీడ్కోలు పలకాల్సిన అవసరం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ఆటగాళ్లు ఆ తర్వాత తమకు ఇష్టమైన ఆటకు దగ్గరగానే ఉండడానికి ఎంతగానో ఆరట పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంతమంది మాజీ క్రికెటర్లుగా మారిన తర్వాత వ్యాఖ్యాతలుగా అవతారం ఎత్తుతూ ఉంటారు. తమ గాత్రంతో ఇక క్రికెట్ మ్యాచ్లను మరింత ఉత్కంఠ బరితంగా మార్చుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 మరి కొంతమంది ఏకంగా కోచ్ లుగా అవతార ఎత్తి తమ అనుభవంతో ఇక ఆయా జట్లలోని ఆటగాళ్ళను సాన పేడుతూ అత్యుత్తమ ఆటగాళ్లుగా మార్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు ఇలా ఎంతోమంది మాజీ ప్లేయర్లు. ఇలా క్రికెట్కు దగ్గరగానే ఉంటారు. కానీ ఇటీవల కాలంలో కొంతమంది ప్లేయర్లు మాత్రం ఏకంగా రాజకీయాల వైపు అడుగులు వేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. భారత మాజీ ప్లేయర్ గౌతం గంభీర్ ఇలాగే బిజెపి పార్టీలో చేరి ఏకంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా కూడా గెలుపొందారు. అచ్చంగా ఇలాగే ఒక స్టార్ క్రికెటర్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించక ముందు ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందాడు.

 ఆ ప్లేయర్ ఎవరో కాదు బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్గా కొనసాగుతున్న షకీబ్ ఆల్ హసన్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా ఎంపీగా ఘన విజయం సాధించాడు. మగురా పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి తన ప్రత్యర్థి పై 1,50,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు షాకీబ్ అల్ హసన్. ఏకంగా 36 ఏళ్ల షాకీబ్ అవామి లీగ్ పార్టీ తరఫున ఎన్నికల్లో బరిలోకి దిగాడు. కొద్దిరోజులే ప్రచారం చేసినప్పటికీ అతనికి క్రికెటర్ గా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా అఖండ మెజారిటీతో విజయం సాధించాడు. ఇక ఎలక్షన్స్ కోసం కొన్నాళ్లపాటు క్రికెట్ కి కూడా దూరం అయ్యాడు ఈ స్టార్ క్రికెటర్. అయితే ఇక ఇప్పుడు ఎంపీగా గెలుపొందడంతో క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా లేదా అనే విషయంపై చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: