టెస్టుల్లో.. అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి : గవాస్కర్

praveen
ఇటీవలే భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనను ముగించుకుంది అన్న విషయం తెలిసిందే. జనవరి 11వ తేదీ నుంచి ఆఫ్ఘనిస్తాన్తో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది. అయితే సౌత్ ఆఫ్రికా పర్యటన లో భాగంగా జరిగిన టెస్టు సీరిస్ లో కొంతమంది ఆటగాళ్ళు దారుణంగా విప్లమయ్యారు. భారీ అంచనాలు పెట్టుకొని వారిని జట్టులోకి తీసుకుంటే ఎక్కడ జట్టుకు ఉపయోగపడే ప్రదర్శన మాత్రం చేయలేకపోయాడు అని చెప్పాలి. ఇలాంటి ఆటగాళ్ళలో శ్రేయస్సు అయ్యర్ కూడా ఒకరు.

 ప్రస్తుతం భారత జట్టు లో కీలక ప్లేయర్గా కొనసాగుతూ ఉన్నాడు శ్రేయస్ అయ్యర్. అతని ఆట తీరుతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమం లోనే వరల్డ్ కప్ లో కూడా సూపర్ ఇన్నింగ్స్ లో అదరగొట్టాడు. ఇక సౌత్ ఆఫ్రికా తో జరిగిన వన్డే సిరీస్ లోను అద్భుతమైన ప్రదర్శన చేశాడు అని చెప్పాలి. కానీ టెస్ట్ ఫార్మాట్కు వచ్చేసరికి మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతన్ని టెస్ట్ ఫార్మాట్ నుంచి పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది అంటూ కొంతమంది క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..

 ఇలాంటి సమయం లో అటు శ్రేయస్ అయ్యర్ ను టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ వెనకేసుకొచ్చాడు. సౌత్ ఆఫ్రికా తో జరిగిన టెస్ట్ సిరీస్ లో విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ మాత్రమే పరవాలేదు అనిపించారు. రోహిత్ గిల్ సహా మిగతా ఆటగాళ్లందరూ కూడా దారుణం గా విఫలమయ్యారు. సౌత్ ఆఫ్రికా పిచ్ లపై రాణించడం ఎవరికైనా కష్టమే. కేవలం శ్రేయస్ అయ్యర్ ఒక్కరిని మాత్రమే టార్గెట్ చేసి విమర్శలు చేయడం సరికాదు.. అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. అప్పుడే మెరుగ్గా రాణించేందుకు వీలు ఉంటుంది అంటూ సునీల్ గవాస్కర్ శ్రేయస్ అయ్యర్ కు మద్దతుగా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: