వార్నర్ అందుకే రిటైర్ అవుతున్నాడేమో.. సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
వరల్డ్ క్రికెట్ లో ఎన్నో ఏళ్ల నుంచి స్టార్ ప్లేయర్లుగా హవా నడిపిస్తూ ఇక ఇప్పుడు రిటైర్మెంట్ కు సిద్ధమయ్యారు కొంతమంది ప్లేయర్లు  అలాంటి వారిలో అటు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా జట్టు తరఫున దాదాపు దశాబ్ద కాలం పాటు మూడు ఫార్మట్లలో కూడా కీలక ప్లేయర్గా కొనసాగాడు డేవిడ్ వార్నర్. అయితే ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన పాకిస్తాన్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ తన కెరీర్లో చివరి టెస్ట్ అంటూ ఇప్పటికే ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే.

 అయితే ఈ టెస్ట్ సిరీస్ ముగియకముందే అటు వన్డే ఫార్మాట్ నుంచి కూడా వీడ్కోలు పలుకుతూ నిర్ణయం తీసుకున్నాడు డేవిడ్ వార్నర్. ఈ క్రమంలోనే ఇక వార్నర్ కి ఘనమైన వీడ్కోలు లభించాలని అతని అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక టి20 ఫార్మాట్లో మాత్రం అతను కొనసాగే అవకాశాలు ఉన్నాయి అనేది తెలుస్తుంది. అయితే డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ గురించి ప్రస్తుతం అందరూ చర్చించుకుంటూ ఉండగా.. ఇక ఇదే విషయంపై స్పందించిన టీమ్ ఇండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు అని చెప్పాలి.

 గతంలో ఒకానొక సందర్భంలో వీరేంద్ర సెహ్వాగ్ డేవిడ్ వార్నర్ కి చెప్పిన మాటలను గుర్తు చేసుకుని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు అని చెప్పాలి. 2009లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున డేవిడ్ వార్నర్ ఆడాడు. అయితే టెస్టుల్లో అయితే ఇంకా బాగా ఆడతావు అని డేవిడ్ వార్నర్ కి ఆ సమయంలో చెప్పాను. కానీ అతను అసలు నమ్మలేదు. అయితే ఆ తర్వాత టెస్ట్ ఫార్మాట్లోకి వెళ్లి అద్భుతంగా రానించాడు. అయితే డేవిడ్ వార్నర్ ఇంకొన్నాళ్ళపాటు ఆడితే బాగుండేది. కానీ ప్రస్తుత వయస్సు రీత్యా అతను రిటైర్ అవుతున్నాడేమో అంటూ వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: