రికార్డు సృష్టించిన స్మృతి మందాన.. ఇండియన్ క్రికెట్లో రెండో ప్లేయర్?

praveen
ఇటీవల కాలంలో భారత జట్టు అదరగొడుతుంది. ఫార్మాట్ తో సంబంధం లేకుండా ప్రత్యర్థి పై  పైచేయి సాధిస్తూ ఉంది. అయితే కేవలం పురుషుల జట్టు మాత్రమే కాదు మహిళల జట్టు కూడా తాము ఎక్కడ మెన్స్ టీమ్ కి తక్కువ కాదు అనే రేంజ్ లోనే ప్రదర్శన చేస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతోమంది మహిళా జట్టు ప్లేయర్లు అదిరిపోయే ప్రదర్శన చేస్తూ అరుదైన రికార్డులను కూడా ఖాతాలో వేసుకుంటున్నారు అని చెప్పాలి.

 కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళలు జట్టు ఇండియా పర్యటనలో ఉంది. ఈ క్రమంలోనే ఇక ఆతిథ్య భారత్ తో వరుసగా సిరీస్ లు ఆడుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ రెండు టీమ్స్ మధ్య టి20 సిరీస్ ప్రారంభమైంది అని చెప్పాలి. ఇక ఇటీవల జరిగిన టి20 మ్యాచ్ లో భారత జట్టు ఘన విజయాన్ని సాధించింది. ఏకంగా ఆస్ట్రేలియా జట్టుపై పూర్తి అధిపత్యం చెలాయించి తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది భారత మహిళల జట్టు. అయితే భారత జట్టు విజయం సాధించడమే కాదు ఇక ఈ మ్యాచ్ లో ఎంతో మంది ప్లేయర్లు అత్యుత్తమ ప్రదర్శన చేసి ఎన్నో అరుదైన రికార్డులను కూడా కొల్లగొట్టారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే  భారత ఓపెనర్ స్మృతి మందాన ఒక అరుదైన రికార్డు సృష్టించింది. మహిళా టి20 లలో 3,000 పరుగులు పూర్తి చేసుకున్న రెండవ బ్యాట్స్మెన్ గా నిలిచింది స్మృతి మందాన. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ-20 మ్యాచ్ లో ఈ ఘనత సాధించింది. ఇప్పటివరకు భారత జట్టు తరుపున హర్మన్ ప్రీత్ కౌర్ 3195 పరుగులు చేసి చేసి మూడు వేల పరుగులు మైలురాయిని అందుకున్న ఒకే ఒక ప్లేయర్గా ఉండగా.. ఇక ఇప్పుడు స్మృతి మందాన ఈ రికార్డును బ్రేక్ చేసింది. ఓవరాల్ టి20 లలో చూసుకుంటే అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్మెన్ గా న్యూజిలాండ్ ప్లేయర్ బేట్స్ 4018 పరుగులు, మెగ్ లానింగ్ 3405 పరుగులు, టేలర్ 3236 పరుగులతో తర్వాత స్థానంలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: