చెమ్మచెక్క చారడేసి మొగ్గా.. మైదానంలో పిల్లాటలు ఆడిన గిల్, కోహ్లీ?

praveen
క్రికెట్ ఆటను ఫన్నీ గేమ్ అని అభివర్ణిస్తూ ఉంటారు క్రికెట్ విశ్లేషకులు. అయితే ఇక మ్యాచ్ జరుగుతున్న సమయం లో ఉండే ఉత్కంఠను చూసిన తర్వాత ఇది ఫన్నీ గేమ్ ఏంటి అని భావన అందరికీ కలిగినప్పటికీ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు చేసే చిలిపి పనులు చూసిన తర్వాత నిజం గానే క్రికెట్ ఫన్నీ గేమ్ అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే మ్యాచ్ జరుగుతున్న సమయం లో జట్టును గెలిపించేందుకు ఎంతో బాధ్యతాయుతం గా వ్యవహరించే క్రికెటర్లు.. అటు మ్యాచ్ ముగిసిన తర్వాత మాత్రం చిన్నపిల్లడి లాగా మారిపోతూ ఉంటారు.

 ఈ క్రమంలోనే సహచరులతో పాటు ప్రత్యర్థి ఆటగాళ్లను కూడా ఆట పట్టించడం చేస్తూ ఉంటారు. అంతేకాదు ఒక్కరిని ఒకరు అనుకరించడం లాంటివి కూడా చేసి నవ్వులు పూయిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల సౌత్ ఆఫ్రికాలో జరిగిన రెండో టెస్టు సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్లు విరాట్ కోహ్లీలు చేసిన పని చూసి ప్రస్తుతం నేటిజన్స్ షాక్ అవుతు నవ్వుకుంటున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 చెమ్మచెక్క చారడేసి మొగ్గ అనే పాట దాదాపుగా అందరికీ గుర్తుండే ఉంటుంది. చిన్నప్పుడు పిల్లలందరూ కలిసి ఎదురు బదురూగా నిలబడి చేతులు చాచి ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఇక ఎగురుతూ గంతులు వేస్తూ పాటలు పాడుతూ ఉండేవారు. కాలక్రమమైన ఇలాంటి నృత్యం చూడటం నేటి రోజులు అరుదుగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇలాంటి జ్ఞాపకాలను మధురానుభూతులను మరోసారి భారత క్రికెటర్లు గుర్తు చేశారు. విరాట్ కోహ్లీ శుభమన్ గిల్ ఏకంగా చెమ్మచెక్క చారడేసి మొగ్గ అంటూ గంతులేసి ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: