జగన్ Vs బాబు,పవన్: ఆ రికార్డ్ కొట్టేదెవరు?

Purushottham Vinay
ఈసారి ఎన్నికల్లో లక్ష మెజారిటీ రికార్డ్  కొడతారు అన్నదానిపై చర్చ నడుస్తుంది.  ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా రెండు లక్షలకు పైగానే ఓట్లు ఉంటాయి.ఇక ఇందులో లక్షా ఎనభై వేల దాకా ఓట్లు పోల్ అయినా అందులో లక్ష మెజారిటీ దక్కడమంటే ప్రత్యర్ధి పార్టీకి ఏ ఏ ముప్పయి నలభై వేల ఓట్లు మాత్రమే రావాలి.అంటే మొత్తం పోల్ అయిన ఓట్లలో అత్యధిక శాతం ఒకరికే రావాలి ప్రత్యర్ధి పోటీ మాత్రం నామమత్రంగా ఉండాలి.అదసలు వీలు అవుతుందా అంటే ఒక్కసారి ఏపీలోని ప్రధాన పార్టీల అధినేతలు పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లాల్సిందే. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న పులివెందులలో ఈసారి లక్ష మెజారిటీ తగ్గకుండా వస్తుందని ఆయన భార్య భారతి ఎంతో ధీమాగా చెప్పారు.ఆమె తన భర్త తరఫున ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టడం జరిగింది.పులివెందుల మొత్తాన్ని ఆమె చుట్టేస్తున్నారు. ఇదిలా ఉంటే పులివెందులలో జగన్ మోహన్ రెడ్డికి 2019లో తొంబై వేలకు పైగా మెజారిటీ వచ్చింది. ఈసారి ముఖ్యమంత్రిగా మరో పదివేలు అదనంగా ఓట్లు యాడ్ అవుతాయని ఆమె బలంగా అంటున్నారు. మరి రాజకీయం చూస్తే అలా ఉందా అంటే పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు మీద దుమారం రేపుతున్నాయి కాంగ్రెస్ తెలుగుదేశం జనసేన పార్టీలు.జగన్ మోహన్ రెడ్డి సొంత చెల్లెలు షర్మిల కడప ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. పులివెందులలో తెలుగుదేశం పార్టీ నుంచి బీ టెచ్ రవి పోటీలో ఉన్నారు.


గత ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి పోటీ చేసిన సతీష్ రెడ్డి ఈసారి వైసీపీలో ఉన్నారు. ఇక బీ టెక్ రవి సత్తా చాటుతామని కూడా అంటున్నారు. ఈసారి జగన్ మోహన్ రెడ్డి మెజారిటీ వీలైనంత వరకూ తగ్గించాలని తెలుగుదేశం చూస్తోంది. మరి లక్ష ఓట్లు  జగన్ మోహన్ రెడ్డికి దక్కితే మాత్రం రికార్డు క్రియేట్ చేసినట్లే అంటున్నారు.మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో ఈసారి లక్ష మెజారిటీ ఖాయం అని చెబుతున్నారు. అయితే గత కొన్ని ఎన్నికల నుంచి ఆయన మెజారిటీ అనేది తగ్గుతూ వస్తోంది. ఆయన ఈసారి 8 వ సారి పోటీలో ఉన్నారు. అయితే కుప్పంలో రెండున్నర లక్షల ఓట్లలో లక్ష మెజారిటీ తెలుగుదేశం పార్టీ దే అంటే వైసీపీ పోటీ నామమాత్రం కావాలి. కానీ లోకల్ బాడీ ఎన్నికల నుంచి అక్కడ వైసీపీ స్ట్రాంగ్ అయిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.కుప్పంలో చంద్రబాబుకు లక్ష ఓట్లు వస్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంది.ఇక పిఠాపురంలో  లక్ష ఓట్లు పవన్ కి అని అంటున్నారు జనసేన నేతలు.ఇక్కడ మొత్తం ఓటర్లు రెండు లక్షల ముప్పయి ఆరు వేల మంది వరకు ఉన్నారు. ఇందులో కచ్చితంగా పోల్ అయ్యేవి లక్షా ఎనభై వేల దాకా అని లెక్క వేస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ కి లక్షా ముప్పయి వేల దాకా వస్తాయా అన్న చర్చ  ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: