జ‌న‌సేన కీ ప‌ర్స‌న్ అసెంబ్లీలో అడుగు పెట్టేనా.. వైసీపీ మంత్రిని ఓడించేనా ?

RAMAKRISHNA S.S.
- తాడేప‌ల్లిగూడెంలో జ‌న‌సేన కాపు Vs వైసీపీ కాపు హోరాహోరీ
- బొలిశెట్టిపై గెలిచేందుకు మంత్రి కొట్టుకు త‌ప్ప‌ని క‌ష్టాలు
- కూట‌మి ప్ర‌భావంతో జ‌న‌సేన దూకుడుకు బ్రేకుల్లేన‌ట్టేనా ?
( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
గోదావరి జిల్లాలు అంటేనే కాపులకు పెట్టని కోట‌లు లాంటి నియోజకవర్గాలు చాలానే ఉంటాయి. ఇలాంటి నియోజకవర్గాలలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వాణిజ్య రాజధానిగా పేరు ఉన్న తాడేపల్లిగూడెం కూడా ఒకటి. కొన్ని దశాబ్దాల నుంచి ఎక్కడ ఎవరు గెలిచినా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే గెలుస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ ఆ తర్వాత ప్రజారాజ్యం, బీజేపీ అంతకుముందు తెలుగుదేశం తర్వాత వైసీపీ గెలిచినా కూడా గూడెంలో కాపు నేతలే ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ చివరిసారిగా 1999లో మాత్రమే విజయం సాధించింది.

గత ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే నానిపై ప్రస్తుతం మంత్రిగా ఉన్న కొట్టు సత్యనారాయణ విజయం సాధించారు. గత ఎన్నికలలో జనసేన నుంచి పోటీ చేసిన బొలిశెట్టి శ్రీనివాస్ ఈసారి కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడం.. బొలిశెట్టి టీడీపీ, బీజేపీ మద్దతుతో పోటీలో ఉండడంతో ఇద్దరి మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఎప్పుడో 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన కొట్టు సత్యనారాయణ తిరిగి 2019లో జగన్ ప్రభంజనంలో విజయం సాధించి అనూహ్యంగా మంత్రి కూడా అయిపోయారు.

అయితే మంత్రి అయ్యాక ఆయనపై తీవ్రమైన అవినీతి, అక్రమాల ఆరోపణలు పెరిగిపోయాయి. ఇటు బొలిశెట్టి గతంలో తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్గా పనిచేసినప్పుడు.. బాగా పనిచేశారు అన్న పేరుతో పాటు గత ఎన్నికలలో ఓడిపోయారని సానుభూతి కూడా ఉంది. ఆయ‌న జ‌న‌సేన లో కీ ప‌ర్స‌న్‌గా కూడా ఉన్నారు. ఇక కొట్టు నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం తాడేపల్లిగూడెంలో కూటమి నుంచి పోటీ చేస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్ కు విజయ అవ‌కాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: