మా శత్రువుకు ఆయుధాలు అమ్మొద్దు.. ఇండియాకు ఆ దేశం వార్నింగ్‌?

Chakravarthi Kalyan
సోవియట్ యూనియన్ లో భాగంగా ఉన్న ఆర్మేనియా, అజర్ బైజాన్ లు చిరకాల ప్రత్యర్థులుగా మారాయి. ఈ రెండు దేశాల మధ్య పరిస్థితి ఇప్పటికీ ఉద్రిక్తంగానే మారింది. నగర్నో-కరబాఖ్ ప్రాంతం మీద ఆధిపత్యం కోసం గడిచిన మూడు దశాబ్దాలుగా ఈ రెండు దేశాల మధ్య చెదురుమదురు సంఘర్షణలు జరుగుతూనే వచ్చాయి.

అయితే కశ్మీర్ తో అంశంతో పాటు పలు సమస్యలపై ఇండియాకు మద్దతు తెలిపే ఆర్మేనియాకు మన దేశం ఆయుధాలను సరఫరా చేస్తోంది. ఇది అజార్ బైజాన్ కి నచ్చడం లేదు. తమ ప్రత్యర్థి ఆర్మేనియాకు దూరంగా ఉండాలని రక్షణ పరికరాలను సరఫరా చేయవద్దని భారత్ కి అజార్ బైజాన్ వార్నింగ్ ఇచ్చింది. జాతీయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన అజర్ బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ బాకులో మాట్లాడుతూ.. ఫ్రాన్స్, ఇండియా, గ్రీస్ దేశాల తమకు వ్యతిరేకంగా ఆర్మేనియాకు ఎలా ఆయుధాలు సరఫరా చేస్తున్నాయో చూస్తున్నాం?

దీనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకుండా ఉండలేం. ఈ వైఖరిని ఆర్మేనియా ప్రభుత్వానికి, ఆర్మేనియాను జాగ్రత్తగా చూసుకోవాలని వారికి బహిరంగంగా వ్యక్తం చేశాం. పరిస్థితి ఇలానే కొనసాగితే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని హెచ్చరించారు. ఇటీవల కాలంలో ఆర్మేనియా తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉంటోంది. ముఖ్యంగా ఇండియా నుంచి పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ వ్యవస్థను, ఆకాశ్ క్షిపణులను కొనుగోలు చేసింది.

అయితే ఈ ప్రాంతంలో తన ప్రయోజనాల కోసం ఆర్మేనియాకు ఎలాంటి సైనిక ఆయుధాలను పంపవద్దని అజర్ బైజాన్ అధ్యక్షుడు అలీయేవ్ బహిరంగంగా పలు దేశాలను కోరాడు. ఆర్మేనియాకి భారత రక్షణ సామగ్రి సరఫరాపై అజార్ బైజన్ ఆందోళన చెందుతోంది.
 భారత్ ఆయుధాలనే కాకుండా, ఫ్రెంచ్ కి చెందిన థేల్స్ గ్రౌండ్ మాస్టర్ 200 రాడార్ సిస్టంను కొనుగోలు చేసింది. తన రక్షణ బడ్జెట్ ను ఆర్మేనియా 1.45బిలియన్ డాలర్లకు పెంచుకుంది. మరి అజార్ బైజాన్ పిలుపునకు భారత్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. మరోవైపు ఈ దేశానికి టర్కీతో పాటు పాకిస్థాన్ బలమైన మద్దతుదారులుగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: