ఫ్లాప్ సినిమాల మ్యానియా !

Seetha Sailaja
సమ్మర్ పీక్ లో ఉంది సెలవుల సీజన్ నడుస్తోంది. ఈసమయంలో  ధియేటర్స్ అన్ని ప్రేక్షకులతో కళకళలాడుతూ కనిపించాలి. అయితే ఆ సీన్ కనిపించడం లేదు సీన్ పూర్తిగా మారిపోయింది. ధియేటర్స్ లో  కనీస స్థాయిలో  కనిపించడం లేదు. దీనికితోడు పేరున్న కొత్త సినిమాలు  కూడా ఏమి రావడంలేదు. దీనితో  ప్రేక్షకులు ధియేటర్స్ ను పూర్తిగా మరిచిపోయారు.  

లేటెస్ట్ గా భారీ పబ్లిసిటీతో విడుదల అయిన విశాల్ ‘రత్నం’ మూవీని  ఎవరు పట్టించుకోలేదు. అంతకన్నా ముందు వారాల్లో వచ్చిన సినిమాలను కూడా  ప్రేక్షకులు పట్టించుకోవడంలేదు. దీనితో కనీసం  వీక్ ఎండ్స్ లో కూడ జనం ధియేటర్స్ కు రావడంలేదు. హోటల్స్  బార్లు పబ్బులు జనంతో కిక్కిరిసి పోతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో  జనం థియేటర్లకు వెళ్లడం కంటే ఇంట్లో కూర్చుని ఓటీటీ లో కొత్త చిత్రాలు చూడడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.    

అయితే ఫెయిల్ అయిన సినిమాలను కూడ ఓటీటీలలో జనం విపరీతంగా చూస్తున్నారు. విజయ్ దేవరకొండ సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ అమేజాన్ ప్రైమ్ ద్వారా స్ట్రీమ్ అవుతున్న పరిస్థితులలో ఈసినిమాను జనం బాగానే చూడటమే  కాకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మరో ఫ్లాప్ మూవీ ‘భీమా’ కు సైతం హాట్ స్టార్‌ లో బాగానే వ్యూయర్‌ షిప్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

ఈ రెండు సినిమాలను ధియేటర్స్ లోకి వెళ్ళి చూడటానికి  ఇష్టపడని  ప్రేక్షకులు ఓటీలలో బాగా చూస్తూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది.   ఇక ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘టిల్లు స్క్వేర్’ కు విపరీతంగా రేటింగ్స్ వస్తున్నాయి. ఈసినిమాలను చూస్తూనే ఓటీటీ లో స్ట్రీమ్ అవుతున్న పర భాష సినిమాలను కూడ భాష అర్థం కాకపోయినా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ను బట్టి జనం చూడటం చూసిన వారికి ప్రేక్షకులు టిక్కెట్ కొనుక్కుని ధియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడటం మర్చిపోయారా అంటూ ఇండస్ట్రీ వర్గాలు మధన పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: