స‌త్తెన‌ప‌ల్లిలో మంత్రి అంబ‌టిని గింగ‌రాలు కొట్టిస్తోన్న క‌న్నా... !

RAMAKRISHNA S.S.
- క‌న్నా జోరు ముందు తేలిపోతోన్న వైసీపీ రాంబాబు
- 15 ఏళ్ల త‌ర్వాత క‌న్నా అసెంబ్లీ ఎంట్రీ ప‌క్కానా..!
- అంబ‌టి నోరు జోరు.. అభివృద్ధి బేజారుతో ఈ సారి ఇంటికేనా..?
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
గుంటూరు జిల్లాలో రెండు ప్రధాన పక్షాల నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే పోటీపడుతున్న ఏకైక నియోజకవర్గం సత్తెనపల్లి. గత కొద్ది ఎన్నిక‌లుగా రెండు ప్రధాన పక్షాల నుంచి కాపు సామాజిక‌ వర్గానికి చెందిన నేత‌లే పోటీపడిన నియోజకవర్గం గుంటూరులో లేదు. గత మూడు, నాలుగు ఎన్నికలలో ఒక పార్టీ కాపు సామాజిక వర్గం నేతకు ఒక నియోజకవర్గంలో సీటు ఇస్తే.. మరో పార్టీ వేరే నియోజకవర్గంలో సీటు ఇచ్చేది. అయితే ఈసారి వైసీపీ ఏకంగా పొన్నూరు, చిలకలూరిపేట, సత్తెనపల్లి అసెంబ్లీ స్థానాలతో పాటు ఏకంగా గుంటూరు పార్లమెంటు స్థానాన్ని కూడా కాపులకు కేటాయించింది.

ఇక ఉమ్మడి జిల్లా మొత్తం మీద కాపు వర్గానికి టీడీపీ కేటాయించిన ఏకైక సీటు సత్తెనపల్లి కావటం విశేషం. పలు పార్టీలు మారి చివరకు ఏపీ, బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసి టీడీపీలో వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు చంద్రబాబు ముందుగానే సత్తెనపల్లి సీటు కేటాయించారు. అక్కడ టీడీపీలో అసమ్మ‌తి నేత కోడెల శివరాం కూడా కన్నాకు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. అన్ని వర్గాలు కలిసి వస్తుండడంతో కన్నా దూసుకుపోతున్నారు.

నియోజకవర్గంలో బలంగా ఉన్న కమ్మ‌ సామాజికవర్గం.. ఇటు కన్నా పోటీ చేస్తుండడంతో కాపు సామాజిక వర్గంతో పాటు, బీసీ సామాజిక వర్గాలు ఏకం అయ్యాయి. దీనికి తోడు కన్నాకు వ్యక్తిగతంగా కూడా ఫాలోయింగ్ ఉంది. దీనికి తోడు నిన్నటి వరకు వైసీపీ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయులు టీడీపీలోకి రావటం కూడా సత్తెనపల్లి నియోజకవర్గంలో కన్నాకు చాలా ప్లస్ అవుతుంది. రెండు బలమైన సామాజిక వర్గాలతో పాటు ఆ సామాజిక వర్గాలను అనుసరించే మిగిలిన సామాజిక వర్గాలు అన్ని ఏకం అయిపోయాయి. చాలా రోజుల తర్వాత కన్నాను గెలిపిస్తే మంత్రి పదవి వస్తుందన్న చర్చలు ఇక్కడ జరుగుతున్నాయి.

అదే సమయంలో వైసీపీ నుంచి పోటీలో ఉన్న మంత్రి అంబటి రాంబాబు నియోజకవర్గానికి చేసింది ఏమి లేకపోగా.. విపరీతమైన అవినీతి ఆరోపణలు, కమీషన్లు దందాలతో ఆయన ప్రతిష్ట మసకబారిపోయింది. ఎలాగైనా అంబటి రాంబాబును ఓడించాలని నియోజకవర్గంలోని సొంత పార్టీ నేతలే కసితో కంకణం కట్టుకుని మరిగి పనిచేస్తున్నారు. అసలు అంబటి సీటు ఇవ్వవద్దని జగన్‌కు చెప్పిన జగన్ పట్టించుకోలేదు. దీనికి తోడు వైసీపీ అభిమానించే రెడ్డి సామాజిక వర్గంతో పాటు వైశ్య, ముస్లిం, ఎస్సీలు కూడా రాంబాబును పట్టించుకోవడం లేదు. ఏది ఏమైనా ఈసారి ఎన్నికలకు ముందే సత్తెనపల్లిలో అంబటి రాంబాబు పై కన్నా లక్ష్మీనారాయణ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: