రాయలసీమ: అత్యంత దారుణం.. వైసీపీకి ఓటు.. కన్నతల్లినే హతమార్చిన క్రూరుడు..!

Divya
ఆంధ్రప్రదేశ్లో ఇటీవలే సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి.. ఓటింగ్ పర్సంటేజ్ 80.66 శాతం వరకు ఓటింగ్ అయినట్లుగా అధికారికంగా తెలియజేశారు ఎన్నికల అధికారి. పలు ప్రాంతాలలో కూడా కొన్నిచోట్ల వైసిపి టిడిపి శ్రేణుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా అనంతపురం జిల్లాలో ఒక సంఘటన అందరిని చాలా బాధాకరానికి గురిచేస్తోంది. వైయస్సార్సీపి పార్టీకి కన్నతల్లి ఓటు వేసిందని ఆమెను హతమార్చడు ఒక కిరాతకుడు .. ఈ ఉదంతం గురించి పూర్తిగా తెలుసుకుందాం.

అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఎగువపల్లికి చెందిన వడ్డే వెంకటేశ్వర్ గత కొన్నేళ్లుగా టిడిపి పార్టీలో ఉన్నారు. అయితే తన తల్లి సుంకమ్మ తనకు మంచి చేసిన పార్టీ వైసీపీ పార్టీ అంటూ ఓటు వేసినట్లు చెప్పడంతో.. ఈ విషయం తెలిసిన ఆమె కుమారుడు వెంకటేశ్వర్ మద్యం తాగి వచ్చి ఒక ఇనుప రాడ్డుతో తన తల్లి తల పైన గట్టిగా బాధడంతో ఆమె అక్కడికక్కడే మరణించినట్లుగా తెలుస్తోంది.. అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వెంకటేశ్వర్ కోసం ప్రత్యేకమైన చర్యలతో గాలింపు చేస్తున్నారు.. అయితే అక్కడి ప్రజలు సైతం ఈ విషయం తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు.. మంచి చేసిన పార్టీకి ఓటు వేస్తే ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడుతున్నారా అంటూ మాట్లాడుతున్నారు ప్రజలు

దీంతో వైసీపీ నేతలు సైతం అలాంటి దుర్మార్గుడిని చాలా కఠినంగా శిక్షించాలి అంటూ పోలీసులకు సూచన ఇస్తున్నారు.. ఇప్పటికే పలు ప్రాంతాలలో కూడా టిడిపి వైసిపి వర్గీల మధ్య రసవత్తంగానే కొట్లాటలో జరుగుతున్నాయి.. ముఖ్యంగా తాడిపత్రి ప్రాంతంలో ఉద్రిక్తత మరింత చోటు చేసుకోవడంతో పోలీసులు కూడా బాస్వవాయువును ఉపయోగించినట్లు తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో ఓటింగ్ ఫలితాల వెలుపడే సమయానికి వీటిని మరింత తగ్గించే విధంగా అధికారులు బలగాలను దించుతున్నారు. అయితే అనంతపురంలో జరిగిన ఈ ఉదాంతం మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: