విక్టరీ : రాజేంద్రుడి గెలుపు.. రేవంత్ కు షాకు?

praveen
తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రచారంతో హోరెత్తించిన అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు మే 13వ తేదీన తేల్చేశారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా అందరూ దృష్టి మాత్రం మినీ ఇండియాగా పిలుచుకునే మల్కాజ్గిరి పైనే ఉంది. ఇక్కడ ఎవరు విజయం సాధించబోతున్నారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది. బిజెపి నుండి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి బిఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి బరిలో నిలిచారు.

 ఇది సీఎం రేవంత్కి సిటీ స్థానం కావడంతో కాంగ్రెస్ కు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. కానీ ఇక్కడ బిజెపి నుంచి బలమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న ఈటెల రాజేందర్ బరిలోకి దిగడంతో వారు వన్ సైడ్ అన్నట్లుగానే మారిపోయింది అని మొదటి నుంచి టాక్ ఉంది. అన్ని వర్గాల నుంచి ఈటలకు మద్దతు అందింది. ఇక బిసి నేతలందరూ కూడా ఈటెల వైపు గెలిచారు. పార్టీ నుంచి కూడా పూర్తిస్థాయి మద్దతు అందింది. అయితే మల్కాజ్గిరి బరిలో నిలిచిన ఈటెల ఇక కొన్ని హామీలను కూడా ఇచ్చారు. మల్కాజ్‌గిరి, 1 - వికసిత్ మల్కాజ్‌గిరి., 2 - స్వచ్ఛ మల్కాజ్‌గిరి, 3 - నైపుణ్య/స్కిల్డ్ మల్కాజ్‌గిరి, 4 - ఆరోగ్య/ఆయుష్మాన్ మల్కాజ్‌గిరి. 5 - ఆత్మనిర్భర నారీ శక్తి మల్కాజ్‌గిరి, 6 - డిజిటల్/ఐటి ఆధారిత మల్కాజ్‌గిరి, 7 - మేక్ ఇన్ మల్కాజ్‌గిరి అనే హామిలను ఈటల రాజేంద్ర మల్కాజ్‌గిరి ఓటర్లకు  ఇచ్చారు.

 అన్ని హామీలను నెరవేర్చి తీరుతానని  బల్ల కొద్దిగా చెప్పారు. ఇంకోవైపు రేవంత్ ఎంపీగా మల్కాజ్గిరి అభివృద్ధికి చేసింది ఏమీ లేదు. దీంతో మిలిటరీ రైల్వే ఉద్యోగుల సమస్యలు అలాగే ఉండిపోయాయి. ఇక ఈ సమస్యలు పరిష్కారం అయ్యేది కేవలం కేంద్రం ప్రభుత్వంతోనే. దీంతో కేంద్రంలో బిజెపి సర్కార్ వస్తుంది కాబట్టి.. ఈటలను గెలిపించుకుంటే తమ సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని అక్కడి ఉద్యోగులు ఈటల వైపే నిలిచారట. ఇలా అన్ని సమీకరణాలను కలుపుకొని మినీ ఇండియాగా పిలుచుకునే మల్కాజ్గిరిలో ఈటెల గెలుపు ఖాయమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ గెలుపును మోదీకి ఈటెల బహుమతిగా ఇవ్వబోతున్నాడు అంటూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: