"ఐపీఎల్ 2024" లో ప్లే ఆప్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన రెండు జట్లు అవే..!

Pulgam Srinivas
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. దాదాపు నెల కింద ప్రారంభం అయిన ఈ సీజన్ లో ఇప్పటికే చాలా మ్యాచ్ లు కంప్లీట్ అయ్యాయి. అందులో భాగంగా కొన్ని జట్లు అద్భుతమైన ప్రదర్శనను కనబరిచి ప్లే ఆప్స్ కి బెర్త్ ను కూడా కన్ఫామ్ చేసుకున్నాయి. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సీజన్ లో ప్లే ఆప్స్ కి బెర్త్ ను కన్ఫామ్ చేసుకున్న జట్లు ఏవి ..? అవి ప్రస్తుతం ఎన్ని మ్యాచ్ లను ఆడాయి ..? ఎన్ని పాయింట్లు ఉన్నాయి ఇలాంటి అనేక వివరాలను తెలుసుకుందాం. "ఐ పీ ఎల్ 2024" మొత్తం 10 టీం లతో ప్రారంభం అయింది.

ఇకపోతే 10 జట్ల మధ్య హోరా హోరి పోరు జరిగినప్పటికీ కొన్ని జట్లు అద్భుతమైన ప్రదర్శనను కనబరిచి ఇప్పటికే ప్లే ఆఫ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. కోల్కతా నైట్ రైడర్స్ , రాజస్థాన్ రాయల్స్ ఈ రెండు జట్లు ఇప్పటికే "ఐ పీ ఎల్ 2024" లో భాగంగా ప్లే ఆఫ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఇప్పటి వరకు ఈ సీజన్ లో 13 మ్యాచ్ లను ఆడగా అందులో తొమ్మిది మ్యాచ్ లలో గెలుపొంది కేవలం మూడు మ్యాచ్ లలో మాత్రమే ఓడిపోయి 19 పాయింట్స్ తో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటి వరకు 12 మ్యాచ్ లను ఆడగా అందులో 8 మ్యాచ్ లలో గెలుపొంది కేవలం నాలుగు మ్యాచ్ లలో మాత్రమే ఓడిపోయి 16 పాయింట్స్ తో  పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది.

ఇక ఈ రెండు జట్లు ఇప్పటికే ప్లే ఆప్స్ కి వెళ్ళిపోయాయి. వీటి స్థానాలలో మార్పు రావచ్చు కానీ ప్లే ఆఫ్ చాన్స్ లకి మాత్రం ఏ డోకా లేదు. ఇకపోతే కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ఇంకో మ్యాచ్ మిగిలి ఉంది. ఈ మ్యాచ్ కూడా గెలిచినట్లు అయితే ఈ జట్టు మొదటి స్థానంలోనే పాయింట్ల పట్టికలో ఉంటుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. ఈ జట్టు రెండు మ్యాచ్ లను గెలిచినట్లు అయితే పాయింట్ల పట్టికలో మొదటి లేదా రెండవ స్థానంలో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: