జైల్లో అల్లు అర్జున్ ను బట్టలిప్పి నిలబెట్టారు.. నటి షాకింగ్ కామెంట్స్?
ఇపుడు తెలుగు రాష్ట్రాల మీడియాలో ఒకే ఒక్క టాపిక్ నిత్యం సర్కిల్ అవుతోంది. అదే సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట వివాదం. ఈ క్రమంలో అల్లు అర్జున్ అరెస్ట్ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి, ఆయన్ని బెడ్ రూమ్ నుంచి అరెస్ట్ చేసి, మరీ పోలీసులు జైలుకి తీసుకెళ్లారు. అల్లు అర్జున్ షర్ట్ మార్చుకుని వస్తానని చెప్పినా పోలీసులు వినలేదు. ఇక బెయిల్ రావడానికి ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ ఓ రాత్రి అంతా చంచల్‌గూడ జైలులో గడపాల్సి వచ్చింది. ఆ తరువాత జైలు నుంచి వచ్చిన తర్వాత అల్లు అర్జున్‌ని కలిసేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులంతా అల్లువారి ఇంటికి వెళ్లడం జరిగింది. కాగా ఈ విషయం మీద తెలంగాణ అసెంబ్లీలో సైతం గంట సేపు పైనే చర్చ జరగడం ఇపుడు సామాన్యుల ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇక అసలు విషయంలోకి వెళితే, చెన్నైలో ఉన్న తెలుగువాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన నటి కస్తూరి దాదాపుగా 3 రోజులు పాటు జైలులో ఉంది. కాగా తాజాగా ఇపుడు నటి కస్తూరి, అల్లు అర్జున్ అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది.. "జైలుకి వెళ్లిన వారందరికీ పోలీసులు బట్టలు విప్పేసి నగ్నంగా కూర్చోబెడతారు. ఎలా పుట్టామో అలాగే నిలబడాలి అక్కడ. లేడీ పోలీసులు ఆడవాళ్లకైతే, ప్రయివేట్ పార్ట్స్ పట్టుకొని మరీ టెస్ట్ చేస్తారు. పళ్లలో, బాడీలో ఎక్కడైనా దాచుకున్నామా అని పరీక్షిస్తారు. ఓ సాధారణ పౌరుడు కూడా జైలుకి వెళ్తే అవమానంతో చచ్చిపోయినట్టు అనిపిస్తుంది. అలాంటిది ఓ స్టార్డమ్, విలాసాలు, సౌకర్యాలను అనుభవించి.. జైలుకి వెళ్తే... ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోండి. నాకు తెలిసి అల్లు అర్జున్ ని కూడా ఇలాగే చేసి ఉంటారు." అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చెప్పుకొచ్చింది.
నాకే తప్పలేదు. ఇక అల్లు అర్జున్ పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కూడా బెయిల్ వస్తుంది, జైలు దాకా వెళ్లరని నాకు అనిపించింది. నాకు తెలిసి జైలు రికార్డుల్లో అల్లు అర్జున్ పేరు ఎక్కించి ఉంటారు. ఫోటో కూడా తీసి ఉంటారు.. అదేవిధంగా ఓ నెంబర్ కూడా కేటాయించి ఉంటారు. ఇలా నగ్నంగా నిలబెట్టి, పరీక్షించి ఉంటారు కూడా. ఎందుకంటే నాకే ఇదంతా జరిగింది! ఇక మేల్ సెలిబ్రిటీకి జరగదంటే నేను నమ్మను! అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కాగా ఈ వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ కూడా రిమాండ్ ఖైదీయే... కాబట్టి నేల మీదే పడుకోవాలి. కప్పుకోవడానికి ఓ దుప్పటి, కింద వేసుకోవడానికి ఓ దుప్పటి ఇస్తారంతే! అంటూ నటి కస్తూరి అన్న మాటలు ఇపుడు అల్లు అభిమానులకు ఇంకాస్త కోపాన్ని తెప్పిస్తున్నాయి.