కేసీఆర్ మౌనాన్ని ప్రజలు తీసుకోవడం లేదా?

Chakravarthi Kalyan

కేసీఆర్ లో అదే గొప్ప గుణం. ఆయన ఎక్కడ ఫైర్ అవాలో బాగా తెలిసిన వారు. ప్రత్యర్థుల మీద మాటలతో శర సంధానమే చేసేవారు.  అసెంబ్లీలో విపక్ష నేతలను మాట్లాడనీయకుండా చేసేవారు. అలాంటి కేసీఆర్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఏడాది కాలంలో ఒకే ఒకసారి అసెంబ్లీకి వచ్చారు.


త్వరలోనే జనంలోకి వస్తారు అని ఒక వైపు వార్తలు వస్తూంటే ఆయన రెస్ట్ తీసుకోవడానికి అమెరికా వెళ్తారని అంటున్నారు.  ఈ నేపథ్యంలో కేటీఆర్ మీద కేసులు పడ్డాయి.  ఒక వైపు ఏసీబీ కేసు ఫైల్ చేస్తే మరో వైపు ఈడీ కేసు ఫైల్ చేసింది. దీంతో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  ఈడీ కేసు అంటే కవితను గతంలో అరెస్ట్ చేసి తీహార్ జైలులో నెలల పాటు ఉంచారు. మరి అలాంటి పరిస్థితి ఉంటుందా అన్న చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ అధినేతగా, దానికి మించి తండ్రిగా కేసీఆర్ అయితే ఎక్కడా రియాక్ట్ కాలేదు. కేసులు నమోదు అయి రెండు మూడు రోజులు అయింది. కేసీఆర్ నుంచి స్టేట్ మెంట్ ఒక చిన్నది కూడా లేదు.


ఎందుకు ఈ మౌనం, దీని వెనక ఏమిటి వ్యూహం అన్నదే చర్చనీయాంశంగా ఉంది. కేసీఆర్ మౌనం ఎపుడూ తుఫాను ముందు నిశ్శబ్ద వాతావరణం అని అంతా అంటారు. ఆయన కనుక మౌన ముద్ర దాలిస్తే ఏదో యాక్షన్ ప్లాన్ దాని వెనక ఉంటుందని చెబుతారు గతంలో తన కుమార్తెని అరెస్ట్ చేసినపుడు మీడియా ముందుకు రాలేదు, తెర వెనకే ఉండిపోయారు.  ఇప్పుడు కుమారుడి వంతు వచ్చింది. కేసీఆర్‌ ఏం చేయబోతున్నారు అన్నదే అంతటా డిస్కషన్ గా ఉంది.


ఏది ఏమైనా ఏసీబీ కేసు అయితే అరెస్ట్ అయినా రాజకీయంగా మైలేజ్ రావచ్చు సానుభూతి వస్తుందని ఎవరైనా అనుకోవచ్చు. ఈడీ కేసులు ఏకంగా తెలంగాణా నుంచి దూరంగా ఎక్కడో జైలులో ఉంచితే మాత్రం బీఆర్ఎస్ లో కొత్త ఇబ్బందులే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: