అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి వార్: వైరల్ అవుతున్న పుష్ప2 సినిమాలోని "నాటీ" డైలాగ్..!
దాదాపు 1500 కోట్లు కలెక్ట్ చేసి ఇప్పుడు 2000 కోట్లు కలెక్ట్ చేసే దిశగా దూసుకుపోతుంది . అయితే ఇదే మూమెంట్లో అల్లు అర్జున్ కూడా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అవ్వడం ..మద్యాంతర బెయిల్ పై బయటకి రావడం హీట్ పెంచేస్తుంది . అంతేకాదు రీసెంట్ గానే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి - అల్లు అర్జున్ పై చేసిన వ్యాఖ్యలు మంట పెట్టేలా చేశాయి . అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన విధానం అంతా కూడా రాంగ్ అంటూ పలువురు జనాలు..పొలిటికల్ స్టార్స్ మాట్లాడుతున్నారు.
కాగా ఇప్పుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగిన తర్వాత పుష్ప 2 సినిమాలోని ఒక డైలాగ్ బాగా ట్రెండ్ అవుతుంది. అదే డైలాగును బాగా వైరల్ చేస్తున్నారు జనాలు. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది . శ్రీవల్లి కోసం సీఎంతో ఫోటో దిగే మూమెంట్లో పుష్పరాజ్ .."శ్రీవల్లి నా పెళ్ళాం.. పెళ్ళాం మాట వింటే ఎట్టుంటాదో ప్రపంచానికి చూపిస్తా" అనే డైలాగ్ చెప్తాడు . అయితే రియల్ లైఫ్ లోను అలాగే చేసావ్ అంటూ స్నేహ రెడ్డి మాటలు విని.. నంద్యాల ప్రచారానికి వెళ్ళావ్ అంటూ అప్పట్లో చాలామంది ట్రోల్ చేశారు . అయితే అల్లు అర్జున్ ఇంత టఫ్ సిచువేషన్ లో ఇరుక్కోవడానికి అదే కారణం అంటున్నారు జనాలు . ఆ కారణంగానే ఈ డైలాగ్ను మరొకసారి ట్రెండ్ చేస్తున్నారు . భార్య మాట వింటే ఇలానే ఇరుక్కుంటా అంటూ దారుణంగా కౌంటర్స్ వేస్తున్నారు..!