అల్లు అర్జున్‌ ఇంటిపై దాడి కేసులో సంచలన తీర్పు?

Chakravarthi Kalyan
నిన్న అల్లు అర్జున్‌ ఇంటిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే.. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని దాడికి దిగిన వారు డిమాండ్ చేశారు. వారికి సాయం చేయడంలో అల్లు అర్జున్ విఫలమయ్యారని నిన్న అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ విద్యార్థి నాయకులు దాడికి దిగారు. ఫ్లకార్డ్సుతో అల్లు అర్జున్ ఇంటి గేటు ముందు నిరసనకు దిగారు. నిరసన కారుల్లో కొందరు ఒక్కసారిగా అర్జున్ ఇంటిపై రాళ్లతో దాడి చేశారు.
ఇంటి రిటర్నింగ్ వాల్ పైకి ఎక్కి రాళ్లు, టమాటాలు కూడా విసిరారు. కొన్ని పూలకుండీలను ధ్వంసం చేశారు. రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఓయూ జేఏసీ నాయకులు ప్లకార్డులు పట్టుకుని డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు పలువురు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ కు తరలించారు. తాజాగా అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడిన ఆరుగురు నిందితులకు  న్యాయమూర్తి  బెయిల్‌ మంజూరు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa

సంబంధిత వార్తలు: