బుల్లితెరపై రోజా రీ ఎంట్రీ.. ఈసారి ఏ షోలో అంటే..!

Divya
నటిగా, రాజకీయ నాయకురాలిగా తనదైన ముద్ర వేసుకున్న హీరోయిన్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పొలిటికల్ పరంగా ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించింది. ఇక నిజ జీవితంలో ఎంతో మందికి సహాయం చేసింది. ఇక బుల్లితెర పైన ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుంచి ఆమె క్రేజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. అయితే గత కొన్ని నెలలుగా ఎలాంటి షోలలో కనిపించలేదు. తాజాగా ఇప్పుడు బుల్లితెర పైన గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. జీ తెలుగు వేదికగా ది ఫ్యామిలీ అసెంబ్లీ అనే ఒక కొత్త ఫన్ ఫీల్డ్ రియాలిటీ షోతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది.


అయితే ఈ షో కి సంబంధించి లేటెస్ట్ పోస్టర్ తో పాటుగా , ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇందులో రోజా సింహాసనం పైన కూర్చొని మరి తన పాత జబర్దస్త్ షోలో తన మేనరిజంతో ఎలా ఆకట్టుకుందో ఇప్పుడు అలాగే ఆకట్టుకునేలా కనిపిస్తోంది.. ప్రోమోలో అయితే రోజా తన మార్కు కామెడీతో మరొకసారి ఆడియన్స్ ని ఆకట్టుకునేలా కనిపిస్తోంది. అలాగే కొంతమంది సెలబ్రిటీలు కూడా ఇందులో కనిపిస్తున్నారు. ఈ షోతో రోజా మళ్ళీ క్రేజ్ పెరగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.


అయితే ఈ షో కి అధ్యక్ష అంటూ అసెంబ్లీ స్టైల్ లో చేసే హంగామా ప్రధాన ఆకర్షణీయంగా నిలబడి ఉన్నట్లు సమాచారం. ఏప్రిల్ 19వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి జి తెలుగు, అలాగే జీ5 ఓటిటిలో కూడా ఈ షో చాలా గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షో కుటుంబ సభ్యులందరితో కలిసి సరదాగా సమయం గడపడానికి పక్క ఎంటర్టైన్మెంట్ షో అన్నట్లుగా సమాచారం. మొత్తానికి రోజా మళ్లీ బుల్లితెర పైన కనిపించబోతోందని తెలిసి అభిమానులు ఆనందపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: