ఇండస్ట్రీలో 'అది'లేని తెలుగు హీరోలు వీళ్లిద్దరే.. ఫ్యాన్స్ కూడా ఎంత ఓపెన్ గా ఒప్పేసుకున్నారు..!

Thota Jaya Madhuri
సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు. యంగ్ హీరోస్.. స్టార్ హీరోస్ ..బడా హీరోస్ పాన్ ఇండియా హీరోస్ ఇలా ఒకరా ఇద్దరా చెప్పుకుంటూ పోతూ ఉంటే రకరకాల క్యాటగిరికి సంబంధించిన హీరోలు బోలెడు మందే ఉన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో పాజిటివిటీ ఎంత ఉంటుందో నెగిటివిటీ కూడా అంతే ఉంటుంది . ఒక హీరోని పొగిడే జనాలు ఉన్నప్పుడు ఆ హీరోని తిట్టే జనాలు కూడా ఉంటారు. ఆ విషయం అందరికీ తెలుసు . అయితే మన తెలుగు ఇండస్ట్రీలో అసలు నెగిటివిటీ లేని ఇద్దరే ఇద్దరు హీరోస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం.


ఆ ఇద్దరు మరెవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న "మహేష్ బాబు" అదే విధంగా రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న" ప్రభాస్ ". ఎస్ ఇండస్ట్రీలో వీళ్ళిద్దరికీ ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు . కానీ వీరిద్దరిపై ఒక్కటంటే ఒక్క నెగిటివ్ వార్త కూడా రాదు.  సినిమాలపరంగా అటు ఇటు వచ్చినా కూడా వ్యక్తిగతంగా పర్సనల్ ఇష్యూస్ కారణంగా ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురైంది లేదు.


మరీ ముఖ్యంగా పొలిటికల్ పరంగా చిక్కుల్లో ఇరుక్కున్న సందర్భాలు కూడా లేవు. మహేష్ బాబు - ప్రభాస్ ఇండస్ట్రీలో నెగిటివిటీ లేని హీరోస్ గా ఎప్పుడు కూడా ముందు స్థానంలో ఉంటారు . మరి ముఖ్యంగా మహేష్ బాబు ఏ విషయం అయినా ఓపెన్ గా చెప్పడం అసలు తనపై నెగిటివిటీని క్రియేట్ చేసుకోకుండా మాట్లాడడం ఆయన స్పెషాలిటీ ఇక రెబల్ స్టార్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మైక్ పట్టుకొని మాట్లాడితేనే కదా ఏదైనా నెగిటివిటీ వచ్చేది . ఎప్పుడు ఫాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు . ఫాన్స్ కూడా ఆ విషయంలో ఇద్దరిని పొగిడేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో నెగిటివిటీ లేని హీరోల వీళ్లిద్దరే అంటూ ఓ రేంజ్ లో మాట్లాడేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఇద్దరు కూడా సినిమాల పరంగా బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నారు . రాజమౌళి దర్శకత్వంలో నటించడానికి మహేష్ బాబు చాలా తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తున్నాడు . ఇక ప్రభాస్ ఆరోగ్యం బాగో లేకపోయినా కమిట్ అయినా సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: