బాబు చెప్పిన‌ట్టే జ‌రుగుతుందా.. అమ‌రావ‌తి నిర్మాణం యూట‌ర్న్ ...!

RAMAKRISHNA S.S.
రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంపై సీఎం చంద్ర‌బాబుచాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. వ‌చ్చే మూడేళ్ల‌లో దీనినిపూర్తి చేసి.. ఎన్నిక‌ల‌కు వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారు. సుమారు 1.5 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు అవుతుంద‌ని అంచ‌నాలు వేసుకుని.. ఆదిశ‌గా ముందుకు సాగుతున్నారు. దీనికి సంబంధించి కేంద్రం కూడా.. 15 వేల కోట్ల రూపాయ‌లు అప్పు రూపంలో ఇప్పిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ అప్పు ఇచ్చేందుకు ఇటీవ‌ల ప్ర‌పంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు కూడా ముందుకు వ‌చ్చాయి.

అయితే.. రుణ ప్ర‌తిపాద‌న‌లు.. సొమ్ములు ఇచ్చేందుకు ఆయా బ్యాంకులు పెడుతున్న నిబంధ‌న‌లు చూస్తే.. చంద్ర‌బాబు చెప్పిన‌ట్టే రాజ‌ధాని నిర్మాణం ముందుకు సాగుతుందా? అనే సందేహాలు వ‌స్తున్నా యి. ప్ర‌పంచ బ్యాంకు రుణాలు ఇవ్వ‌డమే కాకుండా.. వీటి వినియోగానికి సంబంధించి కొన్ని ల‌క్ష్యాలు.. నిబంధ‌న‌లు కూడా పెట్టింది. వీటి ప్ర‌కారం చూస్తే.. కేవ‌లం మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు మాత్రం 6752 కోట్ల రూపాయ‌ల రుణాన్ని వెచ్చించాల్సి ఉంటుంది.

ఇక‌, ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా.. 6752 కోట్ల రూపాయ‌ల అప్పు ఇస్తోంది. ఇది కూడా.. దాదాపు ష‌ర‌తులు, నిబంధ‌న‌ల‌తోనే కూడి ఉంటుంది. దీనిపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. దీంతో సొమ్ములు వ‌స్తున్నా.. చంద్ర‌బాబు అనుకున్న విధంగా నిర్మాణాల‌కు ఖ‌ర్చు చేసేందుకు అవ‌కాశం లేదు. ప్ర‌పంచ బ్యాంకు, ఏడీబీ చెప్పిన‌ట్టే ఖ‌ర్చు చేయాలి. పైగా.. ప్ర‌తి ఏటా.,. సొమ్ముల‌కు సంబంధించిన బిల్లులు స‌మ‌ర్పించ‌డంతోపాటు.. ప్ర‌గ‌తిని కూడా చూపించాలి.

ఇప్ప‌టికిప్పుడు ప్ర‌గ‌తి అంటే.. క‌ష్ట‌మేన‌న్న‌ది అధికారులు చెబుతున్న మాట‌. అదేస‌మ‌యంలో కేవ‌లం రాజ‌ధానిలోనే 30 వేల ఉద్యోగాలు క‌ల్పించాల‌ని, ప్రైవేటు పెట్టుబ‌డులు విరివిగా రాబ‌ట్టాల‌ని.. ప్ర‌పంచ బ్యాంకు పేర్కొన్న ల‌క్ష్యాలు చేరుకోవ‌డం.. కూడా స‌ర్కారుక‌ష్ట‌సాధ్యంగానే ఉంటుంది. పెట్టుబ‌డులు వ‌స్తున్నా... అవి ఇండివిడ్యువ‌ల్ కేట‌గిరిలో అంటే.. ఆసుప‌త్రులు, విద్యాసంస్థ‌లు వంటివి మాత్ర‌మే వ‌స్తున్నాయి. దీంతో అనుకున్న స్థాయిలో ల‌క్ష్యాలు చేర‌డంపై మ‌రింత క‌స‌ర‌త్తు చేయాల్సి ఉంటుంద‌ని అధికారులు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: