ప్రేక్షకుడుకి అర్థంకాని ఉపేంద్ర !

Seetha Sailaja
కన్నడ హీరో ఉపేంద్ర సినిమాలను అర్థం చేసుకోడం చాల కష్టం. అతడి సినిమాలలో మనిషిలో అంతర్లీనంగా ఉండే మానసిక సమస్యలు సామాజిక చైతన్యం ఈ రెండు అతడి సినిమాల కధలలో అంతర్లీనంగా ఉంటాయి. దీనితో అతడి సినిమాల విజయవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య లేటెస్ట్ గా విడుదలైన ఉపేంద్ర ‘యుఐ’ కి విచిత్రమైన టాక్ నడుస్తోంది.

సోషల్ మీడియాలో ఈసినిమాకు కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే మరికొందరు ఉపేంద్ర ఫిలిం మేకింగ్ ను తిడుతున్నారు. మూవీ విమర్శకులు అయితే ఈమూవీని చూసి చాల భయంకరమైన రేటింగ్స్ ఇచ్చారు. ఈమూవీకి వెళ్ళిన సగటు ప్రేక్షకుడు ఈమూవీలో ఉపేంద్ర చెపుతున్న విషయాలు అర్థంకాక మధ్యలో లేచిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ సినిమాను కొందరు ప్రేక్షకులు చివరి వరకు చూసి ఆ మూవీ చాలబాగుంది అని చెపుతున్నట్లు వస్తున్న వార్తలను చూసి కొందరు షాక్ అవుతున్నారు. ఈమూవీలో ఉపేంద్ర నటనను డీ కోడ్ చేస్తే కాని చాలామందికి ఈమూవీ అర్థంకాదు. ఒక పజిల్ లా ఫిలిమ్ టేకింగ్ ఉన్న ఈమూవీ ఉపేంద్ర ఎందుకు తీశాడో ఎవరికీ అర్థంకాకుండా పోయింది.

నేటి వర్తమాన రాజకీయాల పై సెటైర్ కల్ గా మూవీని తీయాలి అని ఉపేంద్ర చేసిన ప్రయత్నం మంచిదే అయినప్పటికీ సగటు ప్రేక్షకులకు అర్థంకాని ప్రయత్నాలు వల్ల ఈ కన్నడ హీరోకు ఏమి కలిసి వస్తుంది అంటూ మరికొందరు ఆశ్చర్యపోతున్నారు. ఇదే సినిమాను మరొక హీరో తీసి ఉంటే కనీసం సోషల్ మీడియాలో కామెంట్స్ కూడ పెట్టరు అంతవరకు ఈసినిమాను ఉపేంద్ర ఇమేజ్ కాపాడింది అనుకోవాలి. ఈవారం విడుదలైన అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ భయంకరమైన ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో పాటు ఉపేంద్ర ‘యుఐ’ మూవీ కూడ ఫ్లాప్ అవ్వడంతో ‘పుష్ప 2’ కలక్షన్స్ కు కలిసి వచ్చే పరిస్థితులు ఏర్పడటంతో ఈమూవీ బయ్యర్లు చాల జోష్ లో ఉన్నట్లు వార్తలు రావడంతో  బన్నీ అభిమానులు జోష్ లో ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: