ఆ ముగ్గురు తెలుగు హీరోలతో సినిమాలు మిస్ అయ్యాయి.. శంకర్..!

Pulgam Srinivas
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో శంకర్ ఒకరు. ఇప్పటివరకు ఈయన ఎన్నో సినిమాలకి దర్శకత్వం వహించాడు. అందులో చాలా మూవీలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం శంకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమాలు ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారతీయుడు 2 సినిమా కొంత కాలం క్రితమే థియేటర్లలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

ఇకపోతే తాజాగా శంకర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు డల్లాస్ లో ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా శంకర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తాడు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

డల్లాస్ లో జరిగిన గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా శంకర్ మాట్లాడుతూ ... గతంలో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలి అని ప్రయత్నించాను ... కానీ కుదరలేదు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయాలి అని కూడా ప్రయత్నించాను ... అది కూడా కుదరలేదు. ఆ తర్వాత ప్రభాస్ తో సినిమాలు చేయడానికి సంప్రదింపులు జరిపాను ... కొన్ని కారణాల వల్ల అది కూడా కుదరలేదు. ఆఖరుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తెలుగు సినిమా చేసే అవకాశం వచ్చింది అని శంకర్ తాజాగా చెప్పుకొచ్చాడు. తాజాగా శంకర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: