అరుదైన రికార్డును సొంతం చేసుకున్న రష్మిక.. ఇతరులకు సాధ్యం అయ్యేనా..?

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కన్నడ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి కిరీక్ పార్టీ అనే కన్నడ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కన్నడ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఛలో అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ నటి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత కూడా ఈమెకు తెలుగులో వరుస పెట్టి అవకాశాలు దక్కాయి.

అందులో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో ఈమె ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అది ఏమిటి అనుకుంటున్నారా ..? ఈమె నటించడం మూడు సినిమాలు అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు వసూలు చేశాయి. కొంత కాలం క్రితం రష్మిక మందన , అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 1 అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ సినిమా 400 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ నటి రన్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమాలో హీరోయిన్గా నటించగా ఈ మూవీ 900 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది.

తాజాగా ఈమె పుష్ప పార్ట్ 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఇప్పటికే 1500 కోట్ల వరకు కలెక్షన్లను వసూలు చేసింది. ఇప్పటికి కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన రన్ ను కంటిన్యూ చేస్తుంది. ఇలా ఈమె నటించిన మూడు సినిమాలు అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: