హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2024: గ్లామర్ అండ్ డాన్స్ తో ఆకట్టుకున్న భాగ్యశ్రీ..క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతుందిగా.?

FARMANULLA SHAIK
తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్తగా నటీమణులు చాలామంది ఎంట్రీ ఇచ్చారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి టాలీవుడ్‌లోకి వచ్చిన ముద్దుగుమ్మల సంఖ్య ఎక్కువగానే ఉన్నది. దాదాపు 15 మందికిపైగానే తెలుగు సినిమాల్లో మెరిశారు.ఈ క్రమంలో మరికొద్దిరోజుల్లో 2024కు ఎండ్ కార్డ్ పడనుంది. పాత క్యాలెండర్ ప్లేస్‌లో కొత్త క్యాలెండర్ రానుంది. ఈ ఏడాది ఎన్నో విజయాలు, తీపి గుర్తులు, జ్ఞాపకాలు, ఆనందాలు , పరాజయాలు ఉన్నాయి. వాటన్నింటిని తలచుకుంటూ కొత్త సంత్సరంలోకి అడుగుపెడుతోంది ప్రపంచం. సామాన్యులే కాదు ప్రముఖులకు కూడా 2024 ఎన్నో జ్ఞాపకాలను అందించింది. ఇలాంటి మెమొరీస్‌ను పంచుకున్నారు యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే.ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయమైన మరో అందం భాగ్యశ్రీ బోర్సే. రవితేజ, హరీశ్‌ శంకర్‌ కాంబోలో వచ్చిన మిస్టర్‌ బచ్చన్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మోడల్‌గా భాగ్యశ్రీ కెరియర్‌ను ప్రారంభించింది. బాలీవుడ్‌లో రొమాంటిక్‌ కామెడి ఎంటర్‌టైనర్‌ యారియాన్‌-2తో బిగ్‌ స్క్రీన్‌కు పరిచయమైంది.

ఇందులో రాజ్యలక్ష్మి కరియప్ప పాత్ర పోషించింది. భాగ్యశ్రీ బోర్సే నటనకు ఫిదా అయిన హరీశ్ శంకర్‌ మిస్టర్‌ బచ్చన్‌లో ఛాన్స్‌ ఇచ్చారు. ఈ మూవీలో భాగ్యశ్రీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. జిక్కి పాత్రకు భాగ్యశ్రీ డబ్బింగ్‌ చెప్పుకోవడం విశేషం.ఈ చిత్రంతో భాగ్య శ్రీ బోర్సే మాత్రం ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. తన అందం అభినయం, నటనతో, డాన్స్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా ఆమె కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఇదిలావుండగా మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ డిజాస్ట‌ర్ అయినా టాలీవుడ్‌లో భాగ్య‌శ్రీ బోర్సేకు ఆఫ‌ర్లు క్యూ క‌డుతోన్నాయి. ప్ర‌స్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. వ‌చ్చే ఏడాది కోలీవుడ్‌లోకి భాగ్య‌శ్రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.తెలుగులో దుల్క‌ర్ స‌ల్మాన్ కాంత‌ మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తోంది భాగ్య‌శ్రీ బోర్సే. ఈ పీరియాడిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీలో రానా విల‌న్‌గా న‌టిస్తూనే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నాడు.

రామ్ హీరోగా మ‌హేష్‌బాబు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమాలో భాగ్య‌శ్రీ హీరోయిన్‌గా ఎంపికైంది. క‌థ‌తో పాటు త‌న క్యారెక్ట‌ర్ న‌చ్చ‌క ఇటీవ‌లే తెలుగులో రెండు భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను భాగ్య‌శ్రీ బోర్సే తిర‌స్క‌రించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌లో న‌టిస్తోన్న టైమ్‌లోనే ఆయ్ మూవీలో హీరోయిన్‌గా భాగ్య‌శ్రీ బోర్సేకు ఛాన్స్ వ‌చ్చింది. డేట్స్ స‌ర్ధుబాటు కాక ఆ ఆఫ‌ర్‌ను మిస్ చేసుకుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తుంది.తాజాగా, భాగ్యశ్రీ బోర్సే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. 2024 దాదాపు ముగుస్తోందని నమ్మలేకపోతున్నాను. కొత్త ప్రారంభంతో కొత్త సంవత్సరం మన ముందుకు రాబోతుంది. నేను నవ్వాను, చాలా ఏడ్చాను, ఎన్నో కలలు కన్నాను. కష్టాలు చూశాను కానీ నేను చెప్పేది ఒక్కటే. మీ అందరికీ నేను కృతజ్ఞురాలిని. నేను ఎప్పుడూ కలలు కనే చాలా ప్రేమను మీ నుంచి పొందాను. ఇన్కమింగ్ ఇంకా చాలా మ్యాజిక్ ఉందని నాకు తెలుసు. అన్ని కష్టాలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. త్వరలో మీ అందరితో పంచుకోవడానికి చాలా కథలు ఉన్నాయి.అని రాసుకొచ్చింది. ప్రజెంట్ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: