బన్నీ బెయిల్ రద్దు కానుందా.. ఆ తప్పు వల్ల బన్నీ కెరీర్ పరంగా నష్టపోనున్నారా?
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన భవిష్యత్తులో బన్నీ పబ్లిక్ ఈవెంట్లకు వెళ్లాలన్నా భయపడేలా చేసిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బన్నీని టార్గెట్ చేశారని కొంతమంది కామెంట్లు చేస్తున్నా ఒక ప్రాణం పోయిన బాధ ఆ కుటుంబానికి తెలుసని ఎన్ని లక్షలు ఇచ్చినా ఆ కుటుంబానికి న్యాయం చేయగలరా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
బన్నీ ఇంటిపై దాడి ఘటనను సీఎం రేవంత్ రెడ్డి ఖండించడం గమనార్హం. బన్నీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జరుగుతున్న ఘటనలు బన్నీ ఫ్యాన్స్ ను సైతం దిక్కుతోచని స్థితిలోకి నెట్టేస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బన్నీ తర్వాత మూవీ షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే ఛాన్స్ అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అల్లు అర్జున్ 20 ఏళ్ల సినీ కెరీర్ లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదనే చెప్పాలి. అల్లు అర్జున్ బెయిల్ రద్దైతే కెరీర్ మరింత ప్రమాదంలో పడుతుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. స్టార్ హీరో అల్లు అర్జున్ కెరీర్ పరంగా ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడని చెప్పవచ్చు. మెగా ఫ్యామిలీ సపోర్ట్ పూర్తిస్థాయిలో లేకపోవడం బన్నీకి మైనస్ అయింది. కేసు కోర్టు పరిధిలో ఉండటం, ప్రభుత్వం వ్యతిరేకంగా ఉండటంతో బన్నీ సైతం ఈ వివాదాల గురించి పూర్తిస్థాయిలో స్పందించే పరిస్థితులు అయితే లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.