తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటి మనులలో శ్రీ లీల ఒకరు. ఈ ముద్దుగుమ్మ శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే సినిమాతో తెలుగు పరిచయం అయింది. ఈ మూవీ తోనే ఈ ముద్దుగుమ్మకు అద్భుతమైన గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈమె నటించిన ధమాకా సినిమా మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో , డాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈమెకు వరుస పెట్టి తెలుగులో అవకాశాలు వచ్చాయి. ఇకపోతే ఈమె నటించిన అనేక సినిమాలు 2023 వ సంవత్సరం విడుదల అయ్యాయి.
కానీ అందులో చాలా వరకు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరుత్సాహపరిచాయి. ఇకపోతే పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ బ్యూటీ ఈ సంవత్సరం చాలా తక్కువ సినిమాల్లో నటించింది. కానీ వాటి ద్వారా ఈ నటికి మంచి గుర్తింపు లభించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా యావరేజ్ విజయం అందుకున్న మహేష్ బాబు మూవీ కావడంతో ఈ బ్యూటీ కి ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది.
ఇక ఈ సంవత్సరం చివరన ఈమె అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ లో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సినిమా విజయం సాధించడం , ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సాంగ్ ద్వారా ఈమెకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అలా పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఈమె తక్కువ సినిమాల్లో నటించిన వాటి ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది.