రేవంత్‌రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్.. పబ్లిక్ సపోర్ట్ అతడికేనా?
రేవంత్‌రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ అంశంలో ప్రజల్లో సానుభూతి, మద్దతు.. రోజుకో తీరుగా మారుతోంది. అసలు ఘటన జరిగిన రోజు ఆ తర్వాత అల్లు అర్జున్ అండ్ టీమ్‌పై బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. ఘటనపై లేట్ గా స్పందించినందుకు కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే.. ఈ ఇష్యూలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ రోజు మాత్రం ఆయనకు సింపతీ వచ్చింది. ఇంత దానికి ఏకంగా అరెస్టా అన్న టాక్ వచ్చింది. ఆ తర్వాత కూడా ఆయనకు బెయిల్ వచ్చినా రిలీజ్ చెయ్యని సమయంలోకూ అల్లు అర్జున్‌కు సింపతీ వచ్చింది.
అయితే.. ఈ తర్వాత అల్లు అర్జున్ ఇంటికి సినీ ప్రముఖులు క్యూ కట్టడం నెగిటివ్ అయ్యింది. అల్లు గ్యాంగ్, ఇండస్ట్రీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాయన్న టాక్ వచ్చింది. ఆ తర్వాత ఇటీవల రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మాత్రం ఒక్కసారిగా ప్రభుత్వానికి అనుకూలంగా సపోర్ట్ వచ్చింది. రేవంత్ అసెంబ్లీ స్పీచ్‌కు జనంలో ఫుల్ సపోర్ట్ లభించింది. అదే రోజు బన్నీ పెట్టిన ప్రెస్ మీట్ కూడా ఆయన్ను సేవ్ చేయలేకపోయింది. అల్లు అర్జున్ సరిగ్గా కవర్ చేసుకోలేక పోయాడనే చెప్పాలి.
అయితే.. గవర్నమెంట్ తరపున మంత్రుల నుంచి ఎంఎల్ఏ లా దాకా అల్లు అర్జున్ మీద ప్రెస్ మీట్స్ పెట్టడంపై మిశ్రమ స్పందన వచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయడంతో మళ్లీ సీన్ మారిపోయింది. ఇదేం పద్ధతి అంటూ జనం రేవంత్ రెడ్డి అండ్ టీమ్‌ను తిట్టుకుంటున్నారు. అప్పటి వరకూ వచ్చిన పాజిటివ్ మాయమవుతోంది. ఇలా ఇది రోజుకో టర్న్ తీసుకుంటోంది. ఇంకెన్ని మలుపులు ఉంటాయో చూడాలి.