విరోష్ వెడ్డింగ్ తర్వాత హాట్ టాపిక్ – ఆస్తుల అసలు స్టోరీ!

Amruth kumar
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ 'విరోష్' (VIROSH) పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఉదయపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహం తర్వాత, ఇప్పుడు అందరి దృష్టి ఈ పవర్ కపుల్ ఆస్తులపై పడింది. 'రౌడీ స్టార్' విజయ్ దేవరకొండ, 'నేషనల్ క్రష్' రష్మిక మందన్న విడివిడిగా సంపాదించిన సంపద ఇప్పుడు ఒక్కటైంది. ఈ జంట కలిపి సుమారు రూ. 135 కోట్ల పైగా నికర ఆస్తులను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.



విజయ్ దేవరకొండ ఆస్తుల విలువ:

విజయ్ కేవలం నటుడు మాత్రమే కాదు, ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్ కూడా.విజయ్ ఆస్తుల విలువ సుమారు రూ. 70 కోట్లు.హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్ ఏరియాలో విజయ్‌కు రూ. 15 కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లు ఉంది.టాలీవుడ్‌లో అతికొద్ది మంది హీరోలకు మాత్రమే ఉన్న ప్రైవేట్ జెట్ (విలువ సుమారు రూ. 30 కోట్లు) విజయ్ సొంతం.తన సొంత క్లోతింగ్ బ్రాండ్ 'Rowdy Wear' తో పాటు హైదరాబాద్ బ్లాక్ హాక్స్ వాలీబాల్ టీమ్ లో ఆయనకు వాటాలు ఉన్నాయి.ఫోర్డ్ ముస్తాంగ్, వోల్వో XC90, bmw 5 సిరీస్ మరియు రేంజ్ రోవర్ వంటి ఖరీదైన కార్లు ఆయన గ్యారేజీలో ఉన్నాయి.


రష్మిక మందన్న: 'నేషనల్ క్రష్' ఆస్తుల జోరు!

ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రష్మిక, రెమ్యూనరేషన్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదునికర విలువ (Net Worth): రష్మిక ఆస్తుల విలువ సుమారు రూ. 66 కోట్లు.రియల్ ఎస్టేట్: రష్మికకు బెంగళూరులో రూ. 8 కోట్ల విలువైన విల్లాతో పాటు.. హైదరాబాద్, ముంబై, గోవా మరియు కూర్గ్‌లో కూడా సొంత ఇళ్లు ఉన్నట్లు సమాచారం.రెమ్యూనరేషన్: ఒక్కో సినిమాకు రష్మిక రూ. 4 నుండి 8 కోట్లు తీసుకుంటుండగా, 'పుష్ప 2' కోసం ఏకంగా రూ. 10 కోట్లు అందుకున్నట్లు టాక్.కార్లు: రేంజ్ రోవర్ స్పోర్ట్, ఆడి Q3, మరియు మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ వంటి లగ్జరీ వాహనాలు ఆమె వద్ద ఉన్నాయి.



ఈ ఇద్దరూ కలిస్తే ఇప్పుడు టాలీవుడ్‌లోనే అత్యంత సంపన్నమైన యంగ్ కపుల్స్‌లో ఒకరుగా నిలిచారు.బ్రాండ్ ఎండోర్స్‌మెంట్స్: ఇద్దరూ కలిసి దాదాపు 15 నుండి 20 బ్రాండ్లకు అంబాసిడర్లుగా ఉన్నారు. ఒక్కో యాడ్ కోసం విజయ్ కోటి రూపాయల వరకు, రష్మిక 50 నుండి 80 లక్షల వరకు ఛార్జ్ చేస్తారు.మార్చి 4న హైదరాబాద్‌లో జరగబోయే గ్రాండ్ రిసెప్షన్ కోసం కూడా కోట్లు ఖర్చు చేస్తున్నారట.డబ్బు, హోదా మాత్రమే కాదు.. ఎనిమిదేళ్ల పవిత్రమైన ప్రేమ వీరిని ఒక్కటి చేసింది. సినిమాల్లో 'గీత గోవిందం'గా అలరించిన ఈ జంట, రియల్ లైఫ్‌లో ఒక 'పవర్ కపుల్'గా మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: