విశాఖలో లోకేష్ ప్రజాదర్బార్ హైలైట్.. 82వ రోజు భారీ స్పందన!

Amruth kumar
సాధారణంగా ఒక మంత్రి పర్యటన అంటే పోలీసులు, కాన్వాయ్‌లు, హడావుడి మాత్రమే కనిపిస్తాయి. కానీ విశాఖలో లోకేష్ పర్యటన మాత్రం అందుకు భిన్నంగా సాగింది. తనను కలవడానికి వచ్చిన సామాన్య ప్రజల మధ్యలోకి వెళ్లి, వారి వినతులు స్వీకరిస్తూ.. అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశమైంది.



మంత్రి నారా లోకేశ్ ఈరోజు ఉదయం విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 82వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయులకు పూర్తిస్థాయి వేతన స్కేళ్లను వర్తింపజేయాలని అనకాపల్లి జిల్లాకు చెందిన నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేశ్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఫార్మసీలో మాస్టర్స్ చేసిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని విశాఖకు చెందిన యామిని కోరారు.


లోకేష్ తన ఉండవల్లి నివాసంలో ప్రారంభించిన 'ప్రజా దర్బార్'ను ఇప్పుడు జిల్లాలకు కూడా విస్తరించారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న ఆయన, వందలాది మంది బాధితులు, విద్యార్థులు, రైతులు మరియు సామాన్య పౌరులతో నేరుగా ముచ్చటించారు.ఉదయం నుంచే లోకేష్ దగ్గరకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పింఛన్లు, భూ సమస్యలు, వైద్య సహాయం, ఉద్యోగ అవకాశాలు వంటి అనేక అంశాలపై ప్రజలు ఆయనకు ఫిర్యాదులు చేశారు.సమస్య విన్న వెంటనే లోకేష్ కేవలం వినతి పత్రం తీసుకుని పక్కన పడేయకుండా, సంబంధిత శాఖా అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య తీవ్రతను వివరించడం అక్కడి వారిని ఆకట్టుకుంది.



విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యార్థుల నుంచి ఆయనకు విన్నపాలు పెరిగాయి.విశాఖలోని ప్రభుత్వ హాస్టళ్లలో సౌకర్యాల కొరత గురించి విద్యార్థులు ఫిర్యాదు చేయగా.. తక్షణమే తనిఖీలు నిర్వహించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.పెండింగ్‌లో ఉన్న ఫీజుల విడుదలపై స్పష్టమైన హామీ ఇచ్చారు. విద్యార్థుల చదువులకు ఎక్కడా ఆటంకం కలగకుండా చూస్తామని భరోసా కల్పించారు.



విశాఖను ఐటీ హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని చెబుతూనే, సామాన్యుల కష్టాలు తీరనిదే అభివృద్ధికి అర్థం లేదని లోకేష్ ఈ ప్రజా దర్బార్ ద్వారా సందేశమిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడ్డ బాధితులు కూడా లోకేష్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. లోకేష్ ఓపికగా ప్రతి ఒక్కరి మాట వింటూ వారితో మమేకం అవ్వడం చూస్తుంటే, ఆయన "లీడర్ ఇన్ మేకింగ్" నుంచి"ప్రజా నాయకుడి"గా ఎదిగిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది.ఎన్నికల సమయంలో 'రెడ్ బుక్'తో చర్చల్లో నిలిచిన లోకేష్, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ప్రజల కష్టాలను రాసుకునే 'ప్రజా పుస్తకం'గా మారారు. విశాఖ ప్రజా దర్బార్ సక్సెస్ కావడంతో, ఇదే తరహాలో ప్రతి జిల్లాలోనూ ప్రజా దర్బార్లు నిర్వహించాలని లోకేష్ భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: