ఇప్పటివరకు విడుదల అయిన తెలుగు సినిమాలలో హైయెస్ట్ లాభాలను అందుకున్న టాప్ 6 తెలుగు మూవీలు ఏవి ..? అందులో పుష్ప పార్ట్ 2 ఏ స్థానంలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.
బాహుబలి 2 : ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు 352 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు చేసి 508 కోట్ల లాభాలను అందుకుని ఇప్పటివరకు అత్యధిక లాభాలను అందుకున్న తెలుగు సినిమాలలో మొదటి స్థానంలో ఉంది.
బాహుబలి 1 : ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు 118 బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి మొత్తం 186 కోట్ల లాభాలు వచ్చాయి. దానితో ఈ సినిమా అత్యధిక లాభాలను అందుకున్న తెలుగు సినిమాలలో రెండవ స్థానంలో ఉంది.
కల్కి 2898 AD : ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు 370 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 169.25 కోట్ల లాభాలను అందుకొని అత్యధిక లాభాలను అందుకున్న తెలుగు సినిమాలలో మూడవ స్థానంలో నిలిచింది.
ఆర్ ఆర్ ఆర్ : రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 163.03 కోట్ల లాభాలను అందుకుని అత్యధిక లాభాలను అందుకున్న తెలుగు సినిమాలలో నాలుగవ స్థానంలో నిలిచింది.
హనుమాన్ : తేజ సజ్జ హీరోగా అమృత అయ్యార్ హీరోయిన్గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు 29.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి 127.95 కోట్ల లాభాలు వచ్చాయి. దానితో ఈ సినిమా హైయెస్ట్ లాభాలను అందుకున్న తెలుగు సినిమాల లిస్టులో ఐదవ స్థానంలో నిలిచింది.
పుష్ప పార్ట్ 2 : అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు 617 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకి సంబంధించిన 17 రోజుల బాక్సాఫీస్ రన్ ఇప్పటివరకు కంప్లీట్ అయ్యింది. 17 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ 99.70 కోట్ల లాభాలను అందుకుంది. దానితో ఈ సినిమా హైయెస్ట్ లాభాలను అందుకున్న టాలీవుడ్ సినిమాలలో ప్రస్తుతం ఆరవ స్థానంలో కొనసాగుతుంది.