వైసీపీ విక్టరీ: వన్ మేన్ ఆర్మీ - జగన్ ?
ఇదిలా ఉండగా ఏపీలో జరిగిన ప్రచార శైలిని చూసుకుంటే.. ఓ పక్క జగన్.. వైసీపీ ఒంటరిగా మిగిలిపోతే.. మరోపక్క చంద్రబాబు, పవన్ కల్యాణ్, ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర అగ్ర నేతలు కూటమి తరఫున ప్రచారం చేశారు. జగన్ ఏ ముహూర్తానా సింహం సింగిల్ గా వస్తుంది అని చెప్పాడో కానీ.. దానిని నిజం చేస్తూ.. వైసీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్.. ప్రచార వ్యూహకర్త, అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారవ వరకు అన్నీ తానై వన్ మ్యాన్ ఆర్మీలా వ్యవహరించాడు సీఎం జగన్.
గత ఎన్నికల్లో చెల్లి, తల్లి, బ్రదర్ అనిల్, పలు సినీ ప్రముఖులు ఇలా జగన్ తరఫున ప్రచారం చేయగా.. ఈసారి మాత్రం ఒంటరిగా పోటీలో నిలబడ్డారు. సోదరీమణులిద్దరూ పక్కలో బల్లెంలా తయారవడం.. చివరి క్షణంలో అమ్మ మద్దతు సోదరి వైపు మళ్లడం, కూటమి నేతలు వ్యక్తిగత దూషణలు, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం.. అధికారులను బదిలీ చేయడం.. డీజీపీని తొలగించడం వెరసి జగన్ ను చుట్టి ముట్టేసి ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.
అయినా జగన్ ఏ మాత్రం బెదరకుండా ధైర్యంగా వీటన్నింటిని ఎదుర్కొన్నారు. మొండిగా ఒక్కడే పోరాడాడు. కడదాకా నిలబడి కూటమి నేతలు చేస్తున్న దుష్ర్పచారాన్ని తిప్పి కొట్టాడు. ఇవన్నీ చేస్తూనే క్షేత్ర స్థాయిలో నాయకుల మధ్య సమన్వయం కుదిర్చేలా చేయడం.. టీవీ ఛానళ్లను మేనేజ్ చేస్తూ.. అభ్యర్థులకు దిశా నిర్దేశం చేసి. గెలుపు వ్యూహాలు రచించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. వన్ మ్యాన్ ఆర్మీ అనే పదానికి సరిగ్గా సరితూగుతాడు.