రిటైర్ అయిన డీన్ ఎల్గర్.. రోహిత్ అరుదైన బహుమతి?

praveen
అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో ఏళ్ల పాటు స్టార్ ప్లేయర్లుగా కొనసాగిన కొంతమంది ప్లేయర్లు.. ప్రస్తుతం రిటైర్మెంట్ కు దగ్గర పడుతూ ఉన్నారు. కొంతమంది ప్లేయర్లు అయితే ఇప్పటికే రిటైర్మెంట్  కూడా ప్రకటించారు అన్న విషయం తెలిసిందే. ఒకవైపు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ అటు పాకిస్తాన్ తో టెస్ట్ సిరీస్ తర్వాత ఇక టెస్ట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు ప్రకటించాడు. అంతకుముందు కానీ వన్డే ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు.

 అచ్చంగా ఇలాగే సౌత్ ఆఫ్రికా తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఆ జట్టు స్టార్ బ్యాట్స్మెన్ డీన్ ఎల్గర్ సైతం ఇక ఆ దేశ పర్యటనలో ఉన్న భారత జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ తర్వాత ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తాను అంటూ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఇటీవలే ఈ స్టార్ ప్లేయర్ తన టెస్ట్ క్రికెట్ కెరియర్ కు వీడ్కోలు పలికేశాడు. కాగా అతని కెప్టెన్సీలో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లలో సౌత్ ఆఫ్రికా జట్టు మొదటి టెస్ట్ మ్యాచ్లో ఘన విజయాన్ని  సాధించగా.. రెండో టెస్ట్ మ్యాచ్ లో మాత్రం అటు భారత జట్టు చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది అని చెప్పాలి.

 ఇలా భారత జట్టుతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ అయిన సౌత్ ఆఫ్రికా క్రికెటర్ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక అరుదైన బహుమతిని ఇచ్చాడు. ఏకంగా భారత జెర్సీని బహుకరించి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు రోహిత్ శర్మ. అయితే ఈ భారత జెర్సీపై ఇక భారత జట్టులోని సభ్యులందరి ఆటోగ్రాఫ్ లు ఉండడం గమనార్హం. ఇక డీన్ ఎల్గర్ కెరియర్ విషయానికి వస్తే 85 టేస్టులు ఆడి ఏకంగా 5331 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు 53 అర్ద సెంచరీలు ఉన్నాయి. ఇక 8 వన్డే లు ఆడి 104 పరుగులు చేశాడు డీన్ ఎల్గర్. 2018లో చివరి వన్డే ఆడగా ఇక ఇటీవల చివరి టేస్ట్ కూడా ఆడేశాడు ఈ స్టార్ ప్లేయర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: