చరిత్ర సృష్టించిన బుమ్రా.. ఇండియా నుండి ఒకే ఒక్కడు?

praveen
సౌత్ ఆఫ్రికా పర్యటనను టీమిండియా ఎంతో గ్రాండ్గా ముగించుకుంది. టెస్ట్ సిరీస్ లో విజయం సాధించి అదరగొట్టాలి అనుకున్న టీమిండియా కు ఇక సిరీస్ దక్కలేదు అని చెప్పాలి. సిరీస్ దక్కక పోయినప్పటికీ రెండో టెస్ట్ మ్యాచ్లో విజయం ద్వారా ఒక చారిత్రాత్మకమైన విక్టరీని సొంతం చేసుకుంది టీమ్ ఇండియా. కేఫ్ టౌన్ వేదికగా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విజయం సాధించలేదు టీమ్ ఇండియా. కానీ మొదటి సారి రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా ఇక్కడ విజయం సాధించి అదర గొట్టింది అని చెప్పాలి. అయితే ఇక రెండో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లతో చెలరేగి  పోయిన భారత ఫేస్ గుర్రం బుమ్రా జట్టు విజయం లో కీలక పాత్ర వహించాడు.

 ఏకంగా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లను తన ఫేస్ బౌలింగ్ తో గడగడలాడించాడు అని చెప్పాలి  ఈ క్రమం లోనే బుమ్రా ఒక అరుదైన రికార్డును కూడా సృష్టించాడు. కేప్ టౌన్ వేదికగా అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితా లో టాప్ లోకి చేరిపోయాడు. అంతకుముందు ఈ రికార్డు జవగల్ శ్రీనాథ్ పేరిట ఉండేది. ఇక ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొట్టాడు అని చెప్పాలి. ఇక ఆ వివరాలు చూసుకుంటే..
కేప్‌టౌన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లవివరాలు చూసుకుంటే..
జస్‌ప్రీత్ బుమ్రా - 17* వికెట్లు
జవగళ్ శ్రీనాథ్ - 12 వికెట్లు
అనిల్ కుంబ్లే - 12 వికెట్లు
 అంతర్జాతీయ క్రికెట్లో చూసుకుంటే  షేన్‌వార్న్‌తో కలిసి సంయుక్తంగా బుమ్రా రెండో స్థానంలో నిలిచాడు. వరల్డ్ క్రికెట్లో కెప్టెన్ వేదికగా ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల లిస్ట్ చూసుకుంటే..
కోలిన్ బ్లైత్ (ఇంగ్లాండ్‌) - 25 వికెట్లు
జస్‌ప్రీత్ బుమ్రా (భారత్‌) - 17* వికెట్లు
షేన్‌వార్న్ (ఆస్ట్రేలియా) - 17 వికెట్లు
జేమ్స్ అండర్సన్ (ఇంగ్లాండ్‌) - 16 వికెట్లు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: