చారిత్రాత్మక విజయం.. మళ్లీ టీం ఇండియాకు అగ్రస్థానం?

praveen
గత కొంతకాలం నుంచి మూడు ఫార్మాట్లలో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ప్రత్యర్థులపై పూర్తి ఆదిపత్యం చెలాయిస్తున్న టీమిండియా.. ఇక ఇటీవల సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఏకంగా సఫారీ జట్టు చేతులో మొదటి టెస్ట్ మ్యాచ్లో ఘోర పరాభవాన్ని చవి చూసింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ అందరు కూడా షాక్ లో మునిగిపోయారు అన్న విషయం తెలిసిందే. మొదటి టెస్ట్ మ్యాచ్లో ఎక్కడ పోటీ ఇవ్వలేకపోయిన భారత జట్టు.. 32 పరుగులతో పాటు ఒక ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది.

 ఈ క్రమంలోనే టీమిండియా ప్రదర్శన పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి అని చెప్పాలి. అయితే ఈ ఓటమి తర్వాత అటు భారత జట్టుకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లు పట్టికలో కూడా ఊహించని షాక్ తగిలింది. ఏకంగా ఒక్కసారిగా ఆరవ స్థానానికి పడిపోయింది అని చెప్పాలి. ఇక ఇలాంటి ఆట తీరుతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవడం కష్టమే అనే ఎంతోమంది మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి విమర్శల మధ్య రెండో టెస్టు ప్రారంభించిన టీమ్ ఇండియా 7 వికెట్ల తేడాతో సఫారీ జట్టును చిత్తుగా ఓడించింది.

 కేప్ టౌన్ వేదికగా తొలిసారి టెస్ట్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది అని చెప్పాలి. అయితే ఇలా సౌత్ ఆఫ్రికా పై సాధించిన విజయంతో మరోసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో సత్తా చాటింది టీం ఇండియా. ఏకంగా టాప్ లోకి దూసుకు వచ్చింది. 54.16% పర్సంటేజీ పాయింట్లతో అగ్రస్థానంకు చేరుకుంది భారత జట్టు. సౌతాఫ్రికా జరిగిన రెండో టెస్టులో ఘన విజయాన్ని సాధించడంతో పాయింట్లు పట్టికలో దూసుకు వెళ్ళింది. ఆ తర్వాత స్థానంలో 50 పాయింట్లతో సౌత్ఆఫ్రికా, 50 పాయింట్లతో న్యూజిలాండ్, 50 పాయింట్లు ఆస్ట్రేలియా తో, బంగ్లాదేశ్ 45.83 పాయింట్లతో పాకిస్తాన్, 16.57 పాయింట్లతో వెస్టిండీస్, 15 పాయింట్లతో ఇంగ్లాండ్, 0.0లతో శ్రీలంక జట్లు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: