టీమిండియా విజయం.. సచిన్ టెండూల్కర్ ఏమన్నాడంటే?

praveen
సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా ఇటీవల అటు ఆతిథ్య  సఫారీ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా అద్భుతంగా రాణిస్తుంది అనుకున్న టీమ్ ఇండియా మొదటి మ్యాచ్ లోనే అందరిని నిరాశపరిచింది. ఏకంగా సౌత్ ఆఫ్రికా చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసింది అన్న విషయం తెలిసిందే. 32 పరుగులతో పాటు ఒక ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది భారత జట్టు. ఈ క్రమంలోని టీమిండియా ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇలాంటి ఆట తీరుతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు గెలవడం కష్టమే అని ఎంతోమంది మాజీ క్రికెటర్లు కూడా విమర్శలు గుప్పించారు అని చెప్పాలి.

 అయితే మొదటి టెస్ట్ మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయిన టీమిండియా అటు రెండో టెస్ట్ మ్యాచ్ లో మాత్రం అద్భుతంగా పుంజుకుంది. ఈ క్రమంలోనే సఫారీ జట్టుకు ఏకంగా వారి సొంత గడ్డమీద వణుకు పుట్టించింది అని చెప్పాలి. భారత బౌలింగ్ విభాగం బుల్లెట్ లాంటి బంతులు విసరడంతో ఇక సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ విభాగం పేక మేడల కూలిపోయింది. ఈ క్రమంలోనే ఇక బ్యాటింగ్ విభాగం కూడా మెరుగ్గా రాణించడంతో చివరికి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించగలిగింది టీం ఇండియా. అయితే రెండో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో భారత కీలక బౌలర్ బుమ్రా ఏకంగా ఐదు వికెట్ల సాధించి అదరగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా సాధించిన విజయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 ఈ క్రమంలోనే ఇదే విషయంపై స్పందించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టీమ్ ఇండియాను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు  మార్కరమ్ డిసిషన్ అత్యుత్తమం. ఇలాంటి పిచ్ పై కొన్ని కొన్ని సార్లు ఎదురుదాడి చేయడం ఉత్తమమైన పని. ఎంతో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నిలకడగా ఎలా బౌలింగ్ చేయాలో అతను మాకు చూపించాడు అంటూ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. కాగా టీమిండియా మొదటిసారి కేప్ టౌన్ వేదికగా టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: