వారెవ్వా.. టెస్ట్ ఫార్మాట్లో గిల్ అరుదైన రికార్డ్?

praveen
ఇటీవల కాలంలో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ఆట తీరుతో అదరగొడుతున్నారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను సైతం కొల్లగొడుతున్నారు. ఇక తమ ఆటతీరుతో జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు అని చెప్పాలి. ఇలా టీమ్ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే తాను భారత జట్టుకు ఫ్యూచర్ అన్న విషయాన్ని నిరూపించుకున్నాడు శుభమన్ గిల్. ఏకంగా భారత క్రికెట్కు ప్రిన్స్ అనే ఒక బిరుదును కూడా సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి.

 ఇక అందుకు తగ్గట్టుగానే అతని ప్రదర్శన కొనసాగుతూ వస్తుంది. ఇక ప్రస్తుత కాలంలో మూడు ఫార్మట్లలో టీమిండియాలో కీలక ప్లేయర్లుగా కొనసాగుతున్న కొంతమందిలో గిల్ కూడా ఒకరు అని చెప్పాలి. ఇక ఫార్మాట్ తో సంబంధం లేకుండా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అదరగొడుతున్నాడు శుభమన్ గిల్ . అయితే ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన టెస్ట్ సిరీస్ లో పెద్దగా పెట్టుకోదగ్గ ప్రదర్శన చేయలేదు అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇక ఇటీవలే రెండో టెస్ట్ మ్యాచ్లో మాత్రం గిల్ ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకునే  టెస్ట్ ఫార్మాట్లో ఏకంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు గిల్.

 ఇటీవల సౌతాఫ్రికా తో కేఫ్ టౌన్ వేదికగా జరిగిన రెండవ టెస్టు మ్యాచ్ సందర్భంగా ఆరు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ రికార్డును సాధించాడు అని చెప్పాలి. అయితే మొదటి మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయిన టీమిండియా.. రెండో మ్యాచ్లో మాత్రం అద్భుతంగా రాణించింది. ఏకంగా ఏడు వికెట్ల తేడాతో సఫారీ జట్టును సొంత గడ్డ మీదే ఓడించింది. ఈ క్రమంలోనే కేఫ్ టౌన్ మైదానంలో టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించిన మొదటి ఆసియా టీం గా నిలిచింది భారత జట్టు. ఈ క్రమంలోనే  రెండో టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించడంతో టెస్ట్ సిరీస్ ని 1-1 తో సమం చేసింది టీమిండియా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: