55 పరుగులకే ఆలౌట్.. సౌత్ ఆఫ్రికా చెత్త రికార్డు?

praveen
ప్రస్తుతం భారత జట్టు సౌత్ఆఫ్రికా పర్యటనలో ఉంది. అయితే ఈ పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్ లలో కూడా సిరీస్ ఆడుతుంది అని చెప్పాలి. అయితే పరిమిత ఓవర్ల ఫార్మాట్లో టీమ్ ఇండియాను ఎదుర్కోలేక డీల పడిపోయిన సౌత్ ఆఫ్రికా జట్టు టెస్ట్ సిరీస్ లో మాత్రం మంచి ప్రదర్శన చేసింది అన్న విషయం తెలిసిందే. పరిమిత ఓవర్ల  ఫార్మాట్ లో టి20 సిరీస్ ను సమం చేసి ఇక వన్డే సిరీస్ కోల్పోయిన సౌత్ ఆఫ్రికా అటు భారత జట్టుతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో మాత్రం అద్భుతంగా రాణించింది.

 ఏకంగా భారత బ్యాట్స్మెన్లు పరుగులు చేయడానికి కష్టపడిన అదే పిచ్ పై సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు మాత్రం పరుగుల వరద పారించారు. ఈ క్రమంలోనే భారత జట్టును 32 పరుగులతో పాటు ఒక ఇన్నింగ్స్ తేడాతో ఓడించారు సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా జోరు చూస్తే రెండో టెస్ట్ మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణించడం ఖాయమని అభిమానులు అందరూ కూడా భావించారు. కానీ ఊహించని రీతిలో సౌత్ ఆఫ్రికాకు రెండో టెస్ట్ మ్యాచ్లో చేదు అనుభవం ఎదురయింది. ఏకంగా మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 55 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది అని చెప్పాలి.

 దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. అయితే ఇలా 55 పరుగులకు ఆల్ అవుట్ కావడం కారణంగా సౌత్ ఆఫ్రికా ఒక చెత్త రికార్డును మూటగట్టుకుంది అని చెప్పాలి. భారత జట్టుపై టెస్ట్ ఫార్మాట్ లో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది టీమిండియా. ఇక ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఫేసర్ల దెబ్బకు సఫారీ జట్టు 55 పరుగులకు ఆల్ అవుట్ కావడంతో ఈ చెత్త రికార్డును మూటగట్టుకుంది. అయితే గతంలోనూ సౌత్ ఆఫ్రికా తక్కువ పరుగులకు ఆల్ అవుట్ అయిన సందర్భాలు ఉన్నాయి. 1932లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 36 పరుగులకు.. 1899 లో ఇంగ్లాండ్ చేతిలో 35 పరుగులకు.. 1896, 1924లో అదే ఇంగ్లాండ్ చేతిలో 30 పరుగులకే చాప చుట్టేసింది సౌత్ ఆఫ్రికా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: