టి20 వరల్డ్ కప్ లో టాప్ స్కోరర్ సూర్యనే.. కానీ ఇండియా ఫైనల్ వెళ్ళదు?

praveen
2024 ఏడాదిలో టి20 వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐసీసీ టోర్నీ గురించి ప్రస్తుతం ప్రపంచ దేశాలు మొత్తం ఎదురుచూస్తున్నాయ్. ఏకంగా ఈ వరల్డ్ కప్ టోర్నీలో 20 జట్లు పాల్గొనబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే క్వాలిఫైయర్ మ్యాచ్లు కూడా ముగిసాయి. ఇక వరల్డ్ కప్ లో పాల్గొనబోయే 20 టీమ్స్ ఏవి అనే విషయంపై అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే ఇక పొట్టి ఫార్మట్ లో వరల్డ్ కప్ గెలవాలని అన్ని టీమ్స్ కూడా ఇప్పటినుంచి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయ్.

 అయితే గత ఏడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భంగపడిన కొన్ని టీమ్స్ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విశ్వవిజేతగా నిలవాలని లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ఇంకా కొన్ని నెలల సమయం ఉన్నప్పటికీ ఎంతో మంది మాజీ ఆటగాళ్లు  ఇప్పటినుంచి తమ రివ్యూలకు పని చెప్పారూ. ఇక ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో ఎవరు అత్యుత్తమ ప్రదర్శన చేస్తారు అనే విషయంపై ఇక తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇదే విషయంపై స్పందించిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 ప్రస్తుతం టి20 ఫార్మర్ లో నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న భారత స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ వచ్చే టి20 వరల్డ్ కప్ లో టాప్ లో ఉంటాడు అంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ చెప్పాడు. సూర్య ఆటను క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంది. అతడు ఆడే కొన్ని షాట్లు మిస్టర్ 360 పేరును తీసుకువచ్చాయి. అతని బ్యాటింగ్ ఎంతో చూడముచ్చటగా అనిపిస్తుంది. వచ్చే ప్రపంచ కప్ లో అతను టాప్ స్కోరర్ గా నిలుస్తాడు. అయితే ఫైనల్ లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు తలబడతాయి అంటూ నాజర్ హుస్సేన్ చెప్పుకొచ్చాడు. ఇలా టాప్ స్కోరర్ సూర్య కుమార్ అయినప్పటికీ ఇండియా ఫైనల్ వెళ్లదు అని చెప్పకనే చెప్పాడు ఈ ఇంగ్లాండు మాజీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: