గర్భాశయాన్ని తొలగించుకున్న భార్య.. కోర్టులో భర్త పిటిషన్.. ఏం తీర్పు వచ్చిందంటే?

praveen
ఇటీవల కాలంలో ఎంతో మంది మనుషులు ఏకంగా విచిత్ర విచిత్రమైన ఆరోపణలతో కేసులు పెట్టడం.. ఇక ఆ కేసులకు సంబంధించిన విచారణ కోర్టులో జరగడం.. కోర్టులు ఆ కేసుల విషయంలో సంచలన తీర్పులు ఇవ్వడం సర్వసాధారణంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో కోర్టులు ఇస్తున్న తీర్పులు కూడా సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. అయితే ఇటీవల ఒక మహిళ గర్భ క్యాన్సర్ తో బాధపడుతున్న కారణంగా గర్భాశయాన్ని తొలగించుకుంది. అయితే ఈ విషయం తెలిసిన భర్త దీనిని మానసిక క్రూరత్వంగా పరిగణించి తమ వివాహాన్ని రద్దు చేయాలి అంటూ కోర్టులో పిటిషన్ వేశాడు.

 అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు భర్త వాదనను తోసి పుచ్చింది అని చెప్పాలి. అనారోగ్య పరిస్థితుల ప్రభావంతో అత్యవసర వైద్యంలో భాగంగానే మహిళ గర్భాశయాన్ని తొలగించుకోవడం ఆమె మానసిక క్రూరత్వంగా భావించలేము అంటూ మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఇదే అంశంపై తొలుత సదురు పిటిషనర్ భార్యకు వ్యతిరేకంగా స్థానిక ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేయడం గమనార్హం. ఆరోగ్య విషయాలను భార్య తన నుంచి దాచిందని ఆరోపించాడు భర్త. ఇక ఇప్పుడు ఏకంగా గర్భాశయాన్ని తొలగించుకొని.. సంతానం పొందలేని స్థితికి తన భార్య చేరుకుంది అంటూ వాదన వినిపించాడు.

 ఇక ఇది క్రూరమైన చర్యగా భావించాలి అంటూ కోర్టును కోరాడు. అయితే పెళ్లి తర్వాతే సదర మహిళలకు క్యాన్సర్ నిర్ధారణ అయిందని విచారణలో తేలింది. ఆరోగ్య అత్యవసర స్థితిలో భాగంగానే భార్య గర్భాశయాన్ని తొలగించుకోవడం అనేది భర్తపై క్రూరత్వం చూపినట్లు కాదని ఫ్యామిలీ కోర్టు తెలిపి భర్త పిటిషన్ కొట్టివేయగా అతను హైకోర్టును ఆశ్రయించాడు. అయితే మద్రాస్ హైకోర్టు కూడా ఫ్యామిలీ కోటు నిర్ణయాన్ని సమర్థించడం గమనార్హం. ఇలా ఆరోగ్య సమస్యలతో భార్య గర్భాశయాన్ని తొలగించుకోవడం కేవలం విధిరాత తప్ప మరొకటి కాదు అని ధర్మసనం భర్తకు హితవు పలికింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: