అవసరమైతే మళ్లీ తిరిగొస్తా.. వార్నర్ కీలక వ్యాఖ్యలు?

praveen
ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ప్రేయర్ గా కొనసాగుతున్న డేవిడ్ వార్నర్ కెరియర్ ప్రస్తుతం ముగింపు దశలో ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే గత కొన్నెళ్ల నుంచి డేవిడ్ వార్నర్ రిటైర్ అవ్వబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి  కానీ ఇక ఇలాంటి వార్తలను పటా పంచలు చేస్తూ ఏకంగా అతను క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలో కూడా కొనసాగుతూనే వస్తున్నాడు. తాను ఇంకా రిటైర్మెంట్కు సిద్ధంగా లేను అంటూ ఎన్నోసార్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు డేవిడ్ వార్నర్. ఇక గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో కూడా ఆస్ట్రేలియా జట్టు తరఫున ఆడి మంచి ప్రదర్శనలు చేశాడు అని చెప్పాలి.

 అయితే ఇప్పుడు మాత్రం మీకు తన కెరీర్ కు ముగింపు పలికాడు. పాకిస్తాన్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే ఇక టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాను అంటూ తెలిపాడు డేవిడ్ వార్నర్  దీంతో అతను వన్డేలతో పాటు టి20 లో కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని అభిమానులు అనుకున్నారు. టెస్టు ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్ ఆటను అటు వన్డేలు టి20 లో చూసే అవకాశం ఉంటుందని సంబరపడ్డారు  కానీ ఇక ఇటీవల ఏకంగా వన్డే ఫార్మాట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు డేవిడ్ వార్నర్ ప్రకటించాడు  దీంతో అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే ఇక రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఈ స్టార్ క్రికెటర్.

 ఒకవేళ 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టుకు తన అవసరం ఉంది అని భావిస్తే మళ్లీ తిరిగి జట్టులోకి వచ్చేందుకు తాను ఎప్పటికీ సిద్ధంగానే ఉంటాను అంటూ డేవిడ్ వార్నర్ తెలిపాడు. ఇక తన వన్డే కెరియర్ లో రెండు ప్రపంచ కప్ లు గెలిచిన సభ్యుడుగా ఉన్నాడు ఈ స్టార్ ప్లేయర్. అయితే తన ఆట తీరుతో అటు తెలుగు క్రికెట్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. ఎన్నో ఏళ్ల పాటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్గా కొనసాగాడు. ఇక ఒకసారి జట్టుకు టైటిల్ కూడా అందించాడు వార్నర్. ఇక ఎంతోమంది తెలుగు హీరోల సినిమాల పాటల పై డాన్సులు చేసి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: