కొత్త స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు.. పంజాబ్ కింగ్స్ భారీ ఆశలు?

praveen
2024 ఐపీఎల్ సీజన్ కు సంబంధించిన హడావిడి ఇండియాలో మొదలైంది అన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 19వ తేదీన జరిగిన మినీ వేలంలో ఇక ఎంతోమంది ఆటగాళ్ళు రికార్డు స్థాయి ధర పలికారు. ఈ క్రమంలోనే యువ ఆటగాళ్లకు కూడా ఆయా ఫ్రాంచైజీలు కోట్ల రూపాయల ధర పెట్టి కొనుగోలు చేశాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక మార్చి నెలలో 2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభం ఉంటుందని అభిమానులు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు.

 అయితే ఇక ఐపీఎల్ లోని కొన్ని మ్యాచ్లను ఈసారి కొత్త స్టేడియం లో కూడా నిర్వహించే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. మొహాలీతో పాటు మరో కొత్త స్టేడియంలో కూడా మ్యాచ్లు జరగనున్నాయట. ముల్లాన్ పూర్ లో కొత్తగా నిర్మిస్తున్న స్టేడియం దాదాపు పూర్తి కావోచ్చింది. ఈ మధ్యే పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు ఈ స్టేడియాన్ని సందర్శించి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికల్లా ఈ స్టేడియం సిద్ధమవుతుంది అన్నది తెలుస్తోంది. అంతేకాదు ఇక జనవరిలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగే టి20 సిరీస్ కి కూడా ముల్లన్ పూర్ స్టేడియం ఆతిథ్యం ఇస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

 అయితే భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగే టి20 సిరీస్ నాటికి స్టేడియం పనులు పూర్తికావు. కానీ ఐపీఎల్ 17వ సీజన్ నాటికి మాత్రం ఇక స్టేడియం పూర్తిగా సంసిద్ధమవుతుందని అధికారులు తెలిపారు. ముల్లన్ పూర్  స్టేడియంలో 12 పిచ్ లు ఏర్పాటు చేసి ఆటగాళ్ల కోసం పెద్ద డ్రెస్సింగ్ రూమ్ లు నిర్మించారు. మొత్తంగా ఇందులో 30000 మంది ప్రేక్షకులు మ్యాచ్ వీక్షించవచ్చు. దాదాపు 1800 కార్లు పార్కింగ్ చేసేందుకు వీలు ఉంటుంది. అయితే ఇక ఐపీఎల్ కు సంబంధించిన మ్యాచ్ లు ఈ స్టేడియంలో జరిగాయి అంటే పంజాబ్ కింగ్స్ కు ఇది హోమ్ గ్రౌండ్ గా మారుతుంది అని చెప్పాలి. మరి ఈ మైదానంలో ఆడటం ద్వారా అయినా పంజాబ్ కు అదృష్టం కలిసి వస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: