REWIND 2023 : ఈ ఏడాది రిటైర్మెంట్ తో.. షాకిచ్చిన క్రికెటర్లు వీళ్లే?

praveen
2023 ఏడాదికి ఇక ముగింపు పలకాల్సిన సమయం వచ్చేసింది. ప్రతి ఏడాది లాగానే ఈ 2023 ఏడాది కూడా అందరికీ ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మిగిల్చింది. అలాగే కొంతమందికి చేదు జ్ఞాపకాలను కూడా మిగిల్చింది అని చెప్పాలి. ఇలా ఎన్నో అనుభూతుల సమ్మేళనంగా ఇక 2023 ఏడాది అందరికీ నిలిచిపోయింది. ప్రస్తుతం ఇక ఈ ఏడాదికి ముగింపు పలకాల్సిన సమయం రావడంతో ఈ సంవత్సరం మొత్తంలో జరిగిన ఎన్నో విషయాలను ప్రతి ఒక్కరు కూడా నెమరు వేసుకుంటూ ఉన్నారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే అందరూ కూడా ఈ ఏడాది జరిగిన ఎన్నో విషయాల గురించి నెమరు వేసుకుంటూ ఉంటే.. అటు క్రికెట్ ప్రేక్షకులు మాత్రం తమకు బాగా నచ్చిన క్రికెట్ ఆటలో ఇక 2023 ఏడాది మొత్తంలో ఏమేం జరిగాయి అన్న విషయాలను ఓసారి గడిచిన రోజుల్లోకి తొంగి చూస్తూ ఉన్నారూ. ఈ క్రమంలోనే ఇక ఈ ఏడాది ఎంతోమంది యువ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ ప్లేయర్లుగా ఎదిగారు. అదే సమయంలో తమ ఆట తీరుతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఎంతో మంది స్టార్ ప్లేయర్లు క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులందరికీ కూడా నిరాశ మిగిల్చారు అని చెప్పాలి.

 ఇలా 2023 ఏడాదిలో ఏకంగా ఆటగాళ్ల రిటైర్మెంట్ చాలామంది క్రికెట్ ప్రేక్షకులకు చేదు జ్ఞాపకాలు గాని మిగిలిపోయాయి అని చెప్పాలి. ఇక ఈ సంవత్సరం క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్ల వివరాలు చూసుకుంటే..
 దక్షిణాఫ్రికా జట్టులో స్టార్ బాట్స్మన్ గా కొనసాగిన క్వింటన్ డీకాక్ ఇక ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ ముగిసిన వెంటనే తన కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ ఫేస్ ఆల్రౌండర్ స్టువర్ట్ బ్రాడ్ సైతం ఇలా తన కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మరో ఇంగ్లాండ్ క్రికెటర్ అలెక్స్ హేల్స్  34 ఏళ్ళ వయసులోని క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. వెస్టిండీస్ స్పిన్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక మహిళా క్రికెట్లో లెజెండ్ గా ఎదిగిన ఆస్ట్రేలియా మహిళ ప్లేయర్ మెగ్ లానింగ్  ఇలా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: