రెండు టెస్ట్ కి ముందు.. టీమిండియాకు మరో బిగ్ షాక్?

praveen
ప్రస్తుతం టీమిండియా సౌత్ ఆఫ్రికా పర్యటన లో ఉంది. ఈ క్రమం లోనే పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సిరీస్ ముగించుకుని ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతుంది అనే విషయం తెలిసిందే. అయితే ఇక ఈ పర్యటన లో భాగం గా భారత జట్టును గాయాల తీవ్రంగా వేధిస్తూ ఉంది. అయితే కీలకమైన సిరీస్ లకు జట్టు లోని కీలక ప్లేయర్ లందరూ కూడా దూరమవుతున్నారు అని చెప్పాలి. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కోసం ఎంపికైన మహమ్మద్ షమీ చీలమండ గాయం నుంచి కోలుకోక పోవడంతో.. జట్టుకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 మరోవైపు వరల్డ్ కప్ సమయం లో గాయపడిన హార్థిక్ పాండ్యా పరిమిత ఓవర్ల ఫార్మాట్కు అందుబాటులో లేకుండా పోయాడు. ఇక ఇంకోవైపు ఇషాన్ కిషన్ వ్యక్తిగత కారణాలతో జట్టు నుంచి తప్పుకున్నాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ వేలికి గాయం కావడంతో అతని స్థానంలో మరొకరిని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా టీమిండియాను గాయాలు బెడద తీవ్రంగా వేధిస్తూ ఉంది అని చెప్పాలి. అయితే ఇటీవల జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఘోర పరాభవాన్ని చవి చూసింది. కానీ రెండో టెస్టులొ మాత్రం అద్భుతంగా పుంజుకొని విజయం సాధించాలని భావిస్తుంది.

 అయితే రెండో టెస్టుకు ముందు అటు భారత జట్టుకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది అన్నది తెలుస్తుంది. జట్టులో స్టార్ పెసర్గా కొనసాగుతున్న శార్దూల్ ఠాగూర్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా శార్దూల్ భుజానికి గాయమైనట్లు సమాచారం. అయితే స్కానింగ్ తీసిన తర్వాత ఇక గాయం తీవ్రత ఎంత ఉంది అన్న విషయంపై క్లారిటీ రానుంది. కాగా తొలి టెస్ట్ మ్యాచ్ లొ శార్దూల్  ఠాగూర్ బౌలింగ్లో ఒక వికెట్ తీసి బ్యాటింగ్లో 26 పరుగులు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: