నేలమట్టం కాబోతున్న.. చారిత్రాత్మక స్టేడియం?

praveen
సాధారణంగా వరల్డ్ క్రికెట్లో ఇక చిరస్థాయిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన మ్యాచ్లు ఎన్నో ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి  అద్వితీయమైన మ్యాచులను ఎప్పుడు ప్రేక్షకులు నెమరు వేసుకుంటూ ఉంటారు. అయితే కేవలం మ్యాచ్లు మాత్రమే కాదు అటు కొన్ని స్టేడియాలు కూడా ఇలా ప్రపంచ క్రికెట్ చరిత్రలో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయ్ అని చెప్పాలి. అలాంటి వాటిలో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్  లో ఉన్న గబ్బా స్టేడియం కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే.

 గబ్బా స్టేడియాన్ని ఏకంగా చారిత్రాత్మక స్టేడియం గా ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఆస్ట్రేలియా జట్టుకు కూడా ఈ స్టేడియం ఎంతో ప్రత్యేకం. ఎలాంటి అరవీర భయంకరమైన టీం అయినా సరే ఈ స్టేడియంలో ఆస్ట్రేలియాను ఓడించడం కష్టం అని క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తూ ఉంటారు. ఇక ఈ చారిత్రాత్మక స్టేడియంలో ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇలా ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గబ్బా స్టేడియం ఇప్పుడు నేలమట్టం కాబోతుంది.

 ఈ స్టేడియాన్ని కూల్చేయ బోతున్నారట. దాని స్థానం లో కొత్త స్టేడియాన్ని పునర్నిర్మించబోతున్నారు అన్నది తెలుస్తుంది. ఈ విషయంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందట. 2032 ఒలంపిక్స్ కు అటు బ్రిస్బేన్ ఆతిథ్యం ఇస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ స్టేడియాన్ని పునర్నిర్మించేందుకు ఆసీస్ ప్రభుత్వం అంగీకారం తెలిపిందట. కాగా 1895 లోనే గబ్బా స్టేడియం లో తొలి క్రికెట్ మ్యాచ్ జరిగినట్లు చరిత్ర చెబుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా గబ్బా స్టేడియం నేల మట్టం కాబోతుంది అన్న విషయం తెలిసి క్రికెట్ ఫ్యాన్స్ అందరూ నిరాశలో మునిగిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: