రోహిత్ మైండ్ లో.. ఆ ఆలోచన ఉండే ఉంటుంది : మురళీధరన్

praveen
ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతూ భారత జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న రోహిత్ శర్మ.. భవితవ్యం ఏంటి అనే విషయంపై గత కొంతకాలం నుంచి భారత క్రికెట్లో చర్చ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే 2023 వన్డే వరల్డ్ కప్ లో టైటిల్ సాధించి రోహిత్ తన కెరీర్ కు ఘనమైన వీడ్కోలను దక్కించుకుంటాడు అని అందరూ భావించినప్పటికీ.. ఇక ప్రపంచ కప్ టైటిల్ మరోసారి అందని ద్రాక్ష లాగానే మారిపోయింది అని చెప్పాలి.

 అయితే ఇక 2024లో టి20 వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. కానీ గత కొంతకాలం నుంచి రోహిత్ శర్మ టి20 లకు దూరంగా ఉంటున్నాడు. తాత్కాలిక కెప్టెన్ అని అందరూ అనుకుంటున్నా.. బీసీసీఐ హార్దిక్ పాండ్యాను టి20 లకు పూర్తిస్థాయి కెప్టెన్ గానే నియమించినట్లు ఇక వరుసగా అతని సారధ్యంలోనే సిరీస్ లు ఆడిస్తూ ఉంది. దీంతో ఇక గత కొంతకాలం నుంచి టి20 లకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మళ్ళీ జట్టులోకి వస్తారా టి20 ఫార్మాట్ ఆడతారా లేదా అనే విషయంపై చర్చ జరుగుతుంది. ఇదే విషయంపై ఎంతోమంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తప్పకుండా అటు 2024 వరల్డ్ కప్ టోర్నీ ఆడాలి అంటూ అభిప్రాయపడుతున్నారు.

 శ్రీలంక లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ సైతం ఇదే విషయంపై స్పందించాడు. రోహిత్ శర్మ తాను కోరుకుంటే 2024 t20 వరల్డ్ కప్ లో ఆడగలడు అంటూ ముత్తయ్య మురళీధర్ అని చెప్పుకొచ్చారు. వరల్డ్ కప్ లో రోహిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 130 ప్లస్ ఉంది. ఇక టి20 లకు అది సరిపోతుంది. రోహిత్ శర్మ కోహ్లీ లాగే ఫిట్నెస్ మైంటైన్ చేస్తే నెక్స్ట్ వరల్డ్ కప్ తప్పకుండా ఆడగలడు. మరో వరల్డ్ కప్ ఆడాలి అనే ఉద్దేశం అతని మైండ్ లో ఉండే ఉంటుంది అంటూ ముత్తయ్య మురళీధరన్ కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: