ఐపీఎల్ లో ఆ టీమ్ కి మెంటార్ గా.. టీమిండియా హెడ్ కోచ్?

praveen
ఎన్నో ఏళ్ల పాటు భారత జట్టుకు సేవలు అందించి.  ఇక ఇండియన్ క్రికెట్ హిస్టరీలో లెజెండ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు రాహుల్ ద్రావిడ్. అయితే ఇక ఇప్పుడు భారత జట్టుకు హెడ్ కోచ్గా కూడా పదవి బాధ్యతలను నిర్వహిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. క్రికెటర్ గా అతను ఎంతలా సక్సెస్ అయ్యాడో.. ఇక కోచ్గా కూడా అంతే సక్సెస్ అయ్యాడు. ఇక ద్రావిడ్ కోచ్ గా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా అటు టీమ్ ఇండియా సూపర్ సక్సెస్ అవుతూ దూసుకుపోతుంది. మూడు ఫార్మట్లలో కూడా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది అని చెప్పాలి.

 అయితే ఇక ఇటీవల వరల్డ్ కప్ ముగియడంతోనే అటు రాహుల్ ద్రవిడ్ కి కూడా టీమిండియా హెడ్ కోచ్ పదవీకాలం ముగిసింది అన్న విషయం తెలిసిందే. అయితే మరోసారి ఆయననే హెడ్ కోచ్గా కొనసాగితే బాగుంటుందని అందరూ అభిప్రాయపడుతున్నప్పటికీ.. గతంలోనే అతి కష్టం మీద టీమ్ ఇండియాకు హెడ్ కోచ్ గా ఉండేందుకు ఒప్పుకున్నా రాహుల్ ద్రావిడ్.. మరోసారి ఆ పదవిలో కొనసాగేందుకు సుముఖంగా లేరు అన్నది తెలుస్తుంది. దీంతో భారత జట్టుకు కొత్త హెడ్ కోచ్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక ఇలా రాహుల్ ద్రావిడ్ కోచింగ్ కాంట్రాక్టు సమయం ముగియడంతో ఆయన భవితవ్యం పై రకరకాల ఊహాగానాలు కూడా తెర మీదకి వస్తున్నాయి.

 ఈ క్రమంలోనే భారత జట్టు హెడ్ కోచ్గా తప్పుకున్న రాహుల్ ద్రావిడ్ ఐపీఎల్ 2024 సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకి మెంటర్ గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు తెరమీదికి వచ్చాయి. అయితే గత సీజన్లో లక్నో జట్టుకి మెంటార్ గా వ్యవహరించిన టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం  గంభీర్.. ఇక తన పాత టీమ్ అయిన కోల్కతా జట్టుకు పని చేసేందుకు సిద్ధమయ్యారు. 2024 ఐపీఎల్ సీజన్ లో కోల్కతాకు మెంటర్గా వ్యవహరించనున్నాడు. అయితే భారత జట్టు హెడ్ కోచ్ గా ఉండేందుకు ద్రావిడ్ ను అటు బీసీసీఐ కన్విన్స్ చేయకపోతే ఇక లక్నోకి మెంటర్ గా ఉండడం ఖాయం అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: