ధోని చెప్పాడు.. నేను చేశాను : రింగు సింగ్

praveen
భారత క్రికెట్ చరిత్రలో బెస్ట్ ఫినిషిర్ ఎవరు అంటే ముందుగా అందరికీ మహేంద్రసింగ్ ధోనినే గుర్తుకు వస్తూ ఉంటాడు. ఎందుకంటే జట్టులోకి క్రికెటర్ గా ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి కూడా తన ఫినిషింగ్ టాలెంట్ తో అదరగొట్టేసాడు. ఐదో స్థానంలో లేదా ఆరవ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి.. చివరి ఓవర్లలో మెరుపులు మెరిపిస్తూ ఉంటాడు మహేంద్రసింగ్ ధోని. ఇక జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అద్భుతమైన ఫినిషింగ్ తో ఇక టీమిండియాకు విజయాలను అందించిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి.


 అయితే మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. అటు భారత జట్టును ఫినిషర్ పాత్ర తీవ్రంగా వేధిస్తూనే ఉంది. అయితే ఇక భారత జట్టుకు చివర్లో సరైన ఫినిషింగ్ ఇచ్చే ఆటగాడి కోసం టీమ్ ఇండియా ఎంతో మందితో ప్రయోగాలు చేసింది. కానీ కొన్నిసార్లు చేతులు కాల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు ఏకంగా భారత జట్టుకు నయా ఫినిషర్ దొరికేశాడు అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. ఆ ప్లేయర్ ఎవరో కాదు యంగ్ బాట్స్మన్ రింకు సింగ్. ఐపీఎల్లో తన ప్రదర్శన ద్వారా ఒక్కసారిగా అందరి చూపును తన వైపుకు తిప్పుకొని.. ఈ యంగ్ బ్యాట్స్మెన్ ఇక ఇప్పుడు టీమిండియా తరపున కూడా అదరగొడుతున్నాడు.


 ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో కూడా చివర్లో వచ్చి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు.. తనదైన శైలిలో ఫినిషింగ్ ఇచ్చి జట్టును గెలిపించాడు  ఈ క్రమంలోనే చివరి ఓవర్లలో మ్యాచ్ ఫినిషింగ్ కు ధోని ఇచ్చిన సూచనలు పాటిస్తున్నాను అంటూ రింకు సింగ్ చెప్పుకొచ్చాడు. చివరి ఓవర్లలో ఆడే సమయంలో ప్రశాంతంగా ఉండాలని మిస్టర్ కూల్ సూచించారు. తాను కూడా ఇక ఇదే సూచనలను అనుసరిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవల మొదటి టి20 మ్యాచ్ లో చివరి ఓవర్లో సిక్సర్ కొట్టి మ్యాచ్ ను ముగించాడు రింకు సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: