'యానిమల్' టైటిల్ పెట్టడానికి.. కారణం అదే : డైరెక్టర్

praveen
సందీప్ రెడ్డి వంగ.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు చాలా తక్కువ మంది ఉంటారు. పేరు అందరికీ తెలిసి ఉంటుంది అంటున్నానంటే.. అతను ఎన్నో సినిమాలు తీసి ఎన్నో సూపర్ హిట్ల కొట్టాడు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అతను ఇప్పటివరకు తీసింది కేవలం రెండు సినిమాలే. అది కూడా ఒక సినిమాకి మరో భాషలో రీమేక్ చేశాడు తప్ప కొత్త సినిమా చేయలేదు. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ బ్లాక్ బస్టర్ కొట్టాడు.

 అయితే ఈ ఒక్క సినిమాతోనే అతను ఎంత ఫేమస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు సందీప్ రెడ్డి వంగ. ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా బడా స్టార్స్ అందరితో కూడా సినిమాలు చేయడానికి రెడీ అయిపోయాడు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు అర్జున్ రెడ్డి లాంటి సినిమా తర్వాత అటు రణబీర్ కపూర్ తో యానిమల్ తీసాడు. ఈ మూవీ డిసెంబర్ ఒకటవ తేదీన రిలీజ్ కాబోతుంది అని చెప్పాలి. ఈ మూవీలో రణబీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి.

 అయితే ఈ మూవీకి యానిమల్ అనే టైటిల్ ని సందీప్ రెడ్డి వంగ ఎందుకు పెట్టాడు అనే విషయంపై ఇక ఈ మూవీ ప్రకటన వచ్చినప్పటి నుంచి చర్చ జరుగుతుంది. కానీ ఇప్పుడు వరకు ఎవరికీ క్లారిటీ రాలేదు. అయితే ఇటీవల ఇదే విషయం గురించి డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు. తెలుగులో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగ.. జంతువులు ఏ పని చేసినా ముందు ఆలోచించవు. ఏది అనిపిస్తే అది చేస్తాయి. ఇక మా సినిమాలో హీరో పాత్ర కూడా అదే తరహాలో ఉంటుంది. అందుకే ఈ మూవీకి యానిమల్ అనే టైటిల్ పెట్టాం అంటూ సందీప్ రెడ్డి వంగ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: