ఇక్కడ క్రీడా స్ఫూర్తి ఎందుకు.. టైమ్డ్ ఔట్ పై హర్ష భోగ్లే?

praveen
సాధారణంగా క్రికెట్లో క్రీడా స్ఫూర్తి అనే పదం అప్పుడప్పుడు తెగ హాట్ టాపిక్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఆటగాళ్లు క్రికెట్లో చాలామందికి తెలియని రూల్స్ ద్వారా ప్రత్యర్థులను దెబ్బ కొడుతూ ఉంటారు. ఇక ఇలాంటి సమయంలోనే క్రీడా స్ఫూర్తి అనే పదం తెరమీదకి వస్తూ ఉంటుంది అని చెప్పాలి. గతంలో అశ్విన్ చేసిన మన్ కడింగ్ చేసిన సమయంలో ఇలాంటిదే జరిగింది. ఇక ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ ఉల్ హాసన్ చేసిన పనితో కూడా క్రీడ స్ఫూర్తి అనే పదం తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది.

 ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఏకంగా శ్రీలంక ఆల్ రౌండర్ మాథ్యూస్ టైమ్డ్ ఔట్ గా పెవిలియన్  చేరాడు అన్న విషయం తెలిసిందే. వికెట్ పడిన తర్వాత అతను నిర్ణీత సమయంలోగా క్రీజులోకి వచ్చి బ్యాటింగ్ కి సిద్ధం కాకపోవడంతో.. ఇక బంగ్లాదేశ్ కెప్టెన్గా కొనసాగుతున్న షకీబ్ అప్పీల్ చేశాడు. దీంతో అంపైర్లు  ఏమీ చేయలేక అతన్ని అవుట్ గా ప్రకటించడంతో అతను పెవిలియన్ చేరాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇది కాస్త వివాదంగా మారింది. షకిబ్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడు అంటూ అందరూ విమర్శలు చేస్తున్నారు.

 ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షాకీబ్ కి భారత క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే మద్దతుగా నిలిచాడు. ఐసీసీ రూల్స్ ప్రకారం.. అతనికి అప్పీల్ చేసుకునే హక్కు ఉంది  అతని నిర్ణయాన్ని మనం డిసైడ్ చేయకూడదు అంటూ హర్ష భోగ్లే వ్యాఖ్యానించాడు. మీరు అంపైర్లను నమ్మాలి. రెండు నిమిషాల గడువు ముగిసింది అని వాళ్ళు చెప్పారు అంటే దాని వెనుక వారికి అపార అనుభవం ఉండి ఉంటుంది. ఇక ఈ విషయంలో క్రీడా స్ఫూర్తిని ప్రస్తావించడం సరైన పద్ధతి కాదు అంటూ హర్ష భోగ్లే కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: