శ్రీలంకతో మ్యాచ్.. పాత గణాంకాలు ఎలా ఉన్నాయంటే?
అయితే ఒక వైపు టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతూ ఉంటే మరోవైపు శ్రీలంక మాత్రం ఆడిన ఆరు మ్యాచ్ లలో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించి వరుస ఓవటములతో సతమతమవుతుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో తప్పకుండా శ్రీలంక పై టీమ్ ఇండియా అది ఆధిపత్యం చెలయిస్తుంది అని అందరూ అనుకుంటూ ఉన్నారు. అదే సమయంలో ఇక ఈ రెండు టీమ్స్ మధ్య పాత గణాంకాలు ఎలా ఉన్నాయి అన్న విషయం గురించి కూడా చర్చించుకుంటున్నారు. అయితే వన్డే ఫార్మాట్లో శ్రీలంక పై టీమిండియాదే ఆదిపత్యం కొనసాగుతూ వస్తుంది.
ఇప్పటివరకు శ్రీలంక టీం ఇండియా మధ్య 167 వన్డే మ్యాచ్లు జరగకగా 98 మ్యాచ్ లు భారత జట్టు విజయం సాధించింది. శ్రీలంక 57 మ్యాచులలోని విజయం సాధించింది. మరో పదకొండు మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఒక మ్యాచ్ టై గా ముగిసింది అని చెప్పాలి. ఇక ఇటీవల భారత్, శ్రీలంక మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్ లలో కూడా ఐదు మ్యాచ్లలో కూడా టీమ్ ఇండియానే ఘనవిజయాన్ని సాధించడం గమనార్హం. ఇక ఆసియా కప్ ఫైనల్లో కేవలం 50 పరుగులకే లంకను భారత జట్టు కుప్పకూల్చడంలో సక్సెస్ అయింది. అంతకుముందు సూపర్ 4 మ్యాచ్ లోను భారతదేశంలో శ్రీలంకకు ఓటమి తప్పలేదు. ఇలా వన్డే ఫార్మాట్లో గణాంకాలు చూసుకుంటే టీమిండియాదే పై చేయిగా కొనసాగుతూ వస్తుంది.